కండలేరును సందర్శించిన చెన్నై కృష్ణా బేసిన్‌ ఇంజనీర్ల బృందం

ABN , First Publish Date - 2023-03-16T23:25:53+05:30 IST

చెన్నై కృష్ణా మెట్రో వాటర్‌ వర్క్సు ఇంజనీర్ల బృందం గురువారం కండలేరుడ్యాంను సందర్శించారు.

 కండలేరును సందర్శించిన  చెన్నై కృష్ణా బేసిన్‌ ఇంజనీర్ల బృందం
కండలేరు డ్యాం అతిథిగృహంలో గంగ ఇంజనీర్లతో సమీక్ష

రాపూరు, మార్చి 16: చెన్నై కృష్ణా మెట్రో వాటర్‌ వర్క్సు ఇంజనీర్ల బృందం గురువారం కండలేరుడ్యాంను సందర్శించారు. డ్యాంతోపాటు, హెడ్‌రెగ్యులేటర్‌, సత్యసాయిగంగ కాలువను పరిశీలించారు. డ్యాంలో విడుదల చేస్తున్న నీటిని పరిశీలించారు. స్థానిక అతిథిగృహంలో గంగ ఇంజనీర్లతో సమీక్షించారు. డ్యాంలో ఉన్న నీటి నిల్వలు గురించి ఆరా తీశారు. ప్రతి ఏడాది డ్యాం నుంచి చెన్నైకు 15టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడి నీటి నిల్వలను పరిశీలించేందుకు వచ్చినట్లు వారు ప్రకటించారు.డ్యాంలో గురువారం 42.639టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చెన్నై వాటరు వర్క్సు సీఈ జైకర్‌ జేసుదాస్‌, ఎస్‌ఈలు ముత్తయ్య, సుగంతి, ఈఈలు తిలైకాసీ, ఇంజనీరు డైరెక్టరు జాన్సన్‌, తెలుగుగంగ ఇంజనీర్లు విజయ్‌కుమార్‌రెడ్డి, ఓబుల్‌దాస్‌, సుధాకర్‌, తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-16T23:26:16+05:30 IST