కైలాసనాథ ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన
ABN , First Publish Date - 2023-11-10T22:46:51+05:30 IST
మండలంలోని వేగూరులో చారిత్రక కైలాసనాథ ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయడం తన పూర్వజన్మ సుకృతమని రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు.
కోవూరు, నవంబరు 10: మండలంలోని వేగూరులో చారిత్రక కైలాసనాథ ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయడం తన పూర్వజన్మ సుకృతమని రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వేగూరులో జరిగిన జగనే సీఎం ఎందుకు కావాలంటే కార్యక్రమంలో ఆయన ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రూ1.30 కోట్లతో నిర్మించనున్న కైలాసనాథస్వామి ఆలయం ఎంతో ప్రాముఖ్యత కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహామండలి చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డి, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటి మేయర్ రూప్‌కుమార్ యాదవ్, విజయా డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, ఎంపీపీ పార్వతి, జడ్పీటీసీ శ్రీలత, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, పడుగుపాడు సొసైటీ చైర్మన్ మల్లికార్జున్‌రెడ్డి, నాయకులు సుబ్బారెడ్డి, హరిప్రసాద్‌రెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.