జిల్లాలో 30 లక్షల పని దినాలు

ABN , First Publish Date - 2023-01-26T00:24:32+05:30 IST

జిల్లాలోని 37 మండలాల్లో ఈ ఏడాది మార్చి చివరి నాటికి 30లక్షల పనిదినాలు కూలీలకు కల్పించాలని డ్వామా పీడీ వెంకట్రావు ఆదేశించారు.

జిల్లాలో 30 లక్షల పని దినాలు
మాట్లాడుతున్న డ్వామా పీడీ వెంకట్రావు

ఉదయగిరి, జనవరి 25: జిల్లాలోని 37 మండలాల్లో ఈ ఏడాది మార్చి చివరి నాటికి 30లక్షల పనిదినాలు కూలీలకు కల్పించాలని డ్వామా పీడీ వెంకట్రావు ఆదేశించారు. బుధవారం ఉదయగిరి, దుత్తలూరు మండల పరిషత్‌ కార్యాలయాల్లో సీతారామపురం, ఉదయగిరి, దుత్తలూరు, వరికుంటపాడు మండలాల ఉపాధి హామీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సన్నకారు రైతులు వ్యవసాయ కూలీలకు రూ.257లు వేతనం అందేలా పని వద్ద కొలతలు చూపాలన్నారు. ప్రభుత్వ కొలతల ప్రకారం పనులు జరిగేలా సిబ్బంది చొరవ చూపాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఐజాక్‌ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:25:00+05:30 IST