పది విద్యార్థులకు ఐటీఐ కోర్సులపై అవగాహన

ABN , First Publish Date - 2023-03-25T22:57:43+05:30 IST

సంగం జెడ్పీ ఉన్నత, వికాస్‌ ఉన్నత పాఠశాల్లో పదవ తరగతి చదివే విద్యార్థులకు సంగం ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌ ఏడుకొండలు శనివారం ఐటీఐ కోర్సుల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. సంగం ఐటీఐలో ఎలక్ట్రీషియన్‌, ఫి

పది విద్యార్థులకు ఐటీఐ కోర్సులపై అవగాహన
25ఎస్‌జిఎం2: ఐటీఐ కోర్సుల గురించి వివరిస్తున్న నిర్వాహకులు

సంగం, మార్చి 25: సంగం జెడ్పీ ఉన్నత, వికాస్‌ ఉన్నత పాఠశాల్లో పదవ తరగతి చదివే విద్యార్థులకు సంగం ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌ ఏడుకొండలు శనివారం ఐటీఐ కోర్సుల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. సంగం ఐటీఐలో ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌ ట్రేడ్‌లు ఉన్నాయన్నారు. ఐటీఐ పూర్తి చేసిన వారు బ్రిడ్జి కోర్సు ద్వారా పాలిటెక్నిక్‌ డిప్లమా కోర్సు రెండవ సంవత్సరంలో నేరుగా చేరవచ్చునన్నారు. క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా ఏపీ ట్రాన్స్‌పోర్ట్‌, ఆర్టీసీ, షార్‌, రైల్వే ఉద్యోగ అవకాశాలు పొందవచ్చునన్నారు. ఐటీఐ చదివే విద్యార్థులకు ఆర్టీసీ బస్‌పాస్‌తోపాటు జగనన్న విద్యా దీవెన అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీఐ అధ్యాపకులతోపాటు స్థానిక ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T22:57:43+05:30 IST