Share News

గ్రామాల్లో మేకపాటి పర్యటన

ABN , First Publish Date - 2023-12-05T23:05:32+05:30 IST

తుఫాన్‌తో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకొనేందుకు వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మేకపాటి రాజగోపాల్‌రెడ్డి మంగళవారం గ్రామాల్లో పర్యటన సాగించారు. నివాసాలు నీటి మునిగిన గొల్లపల్లి ఎస్టీ కాలనీని సందర్శించారు. అనంతరం కాంచెరువు పునరావాస కేంద్రంలో ఉన్న కందుకూరుకి చెందిన బాధితులతో మాట్లాడి

గ్రామాల్లో మేకపాటి పర్యటన
5వీకేపీ4: కాలనీవాసులతో మాట్లాడుతున్న మేకపాటి

వరికుంటపాడు, డిసెంబరు 5: తుఫాన్‌తో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకొనేందుకు వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మేకపాటి రాజగోపాల్‌రెడ్డి మంగళవారం గ్రామాల్లో పర్యటన సాగించారు. నివాసాలు నీటి మునిగిన గొల్లపల్లి ఎస్టీ కాలనీని సందర్శించారు. అనంతరం కాంచెరువు పునరావాస కేంద్రంలో ఉన్న కందుకూరుకి చెందిన బాధితులతో మాట్లాడి వసతుల కల్పనపై ఆరా తీశారు. ఆయన వెంట స్ధానిక వైసీపీ నాయకులు, ఉద్యోగులు తదితరులు ఉన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఉదయగిరిరూరల్‌ : విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మేకపాటి. రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం గండిపాళెం గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని ఉపాధ్యాయులకు సూచించారు. శిఽథిలావస్థలో ఉన్న భవనాలపైకి వెళ్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం గండిపాలెం జలాశయాన్ని సందర్శించారు. ఆయన వెంట మండల కన్వీనర్‌ జీ. ఓబులరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ అలీఅహమ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-05T23:05:33+05:30 IST