ఘనంగా మహమ్మద్ ప్రవక్త జన్మదినం
ABN , First Publish Date - 2023-09-28T22:27:17+05:30 IST
: మిలాద్ ఉన్ నబీ సందర్భంగా మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని స్థానిక రిజర్వుడు కాలనీ మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, పాలు, రొట్టెలను కమిటీ సభ్యులతోపాటు డాక్టర్ వెంకయ్య, డా
ఉలవపాడు, సెప్టెంబరు 28 : మిలాద్ ఉన్ నబీ సందర్భంగా మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని స్థానిక రిజర్వుడు కాలనీ మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, పాలు, రొట్టెలను కమిటీ సభ్యులతోపాటు డాక్టర్ వెంకయ్య, డాక్టర్ ఐశ్వర్య తదితరులు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ అధ్యక్షుడు ఎస్‌డీ మాబాషా, సభ్యులు ఎస్‌డీ దస్తగిరి, ఎస్‌కే సుల్తాన్‌బాషా, షుకూర్, గౌస్‌బాషా, రంతుల్లా, జిలానిబాషా, షరీష్ తదితరులు పాల్గొన్నారు.
కావలి : మిలాద్ ఉన్ నబీ సందర్భంగా కావలి తుఫాన్‌నగర్‌లోని సుల్తాన్ మదీనా మసీద్ ఆవరణలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. వాయిస్ ఆఫ్ ముస్లిం మైనార్టీ సంస్థ అధ్యక్షుడు మొగల్ సలీమ్‌బేగ్, మసీదు కమటీ సభ్యులు షేక్ ముజీబ్, అక్రమ్, షాజహాన్, దస్తగిరి, కాలేషా, రేడ్‌క్రాస్ ప్రతినిధులు నయీమ్, పద్మావతి, శేషమ్మ, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శిబిరంలో 30 మంది రక్తదానం చేశారు.
ఆత్మకూరు, సెప్టెంబరు 28: మిలాద్ ఉన్ నబీ పండుగను ముస్లీంలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా జేఆర్‌పేటలోని మహబూబ్ సభాని దర్గా వద్ద ప్రత్యేక ప్రార్ధనలు, గంధ మహోత్సవం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో పలువురు ముస్లీం పెద్దలు పాల్గొన్నారు.
ఏఎస్ పేట : ఏఎస్ పేటతో పాటు అనుమసముద్రం, గండువారిపల్లి తదితర గ్రామాలలో గురువారం మిలాద్ ఉన్ నబీ పండుగను ముస్లీంలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్బంగా ఏఎస్ పేట దర్గా సెంటర్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తిప్ప ఉన్న బురుజుపైకి వెళ్లి నిషాని జెండాను ఆవిష్కరించారు. ప్రాత్యేక ప్రార్థనలు నిర్వహించి ప్రసాదాలు పంచిపెట్టారు.
ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు
ఉదయగిరి, సెప్టెంబరు 28: ఉదయగిరి మండలంలో గురువారం ముస్లిం సోదరులు మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. మండలంలోని గండిపాళెం, వెంగళరావునగర్, దాసరిపల్లి, బిజ్జంపల్లి, ఉదయగిరి మసీదుల్లో మహమ్మద్‌ప్రవక్త్ జన్మదిన విశిష్టతను ఇమామ్‌లు బోధించారు. అనంతరం జిలేబీలు పంచిపెట్టారు. గాజుల నజీముద్దీన్ నివాసంలో అస్థాన, అబీద్‌బాబా దర్గా, పెద్దమసీదులనందు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రవక్తల పాదముద్రికలు, జుబ్బాలు తదితర వస్తువులను ప్రదర్శించారు. అనంతరం జెండా ఉత్సవాన్ని నిర్వహించారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
దుత్తలూరు(ఉదయగిరి రూరల్), సెప్టెంబరు 28: దుత్తలూరు మండలంలో గురువారం ముస్లిం సోదరులు మిలాద్-ఉన్-నబీ వేడుకలను వైభవంగా నిర్వహించారు. మండలంలోని నందిపాడు, నర్రవాడ, దుత్తలూరు, ఏరుకొల్లు, వెంకటంపేట తదితర గ్రామాల మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ప్రసాదాలు పంచిపెట్టారు.
వరికుంటపాడు, సెప్టెంబరు 28: మిలాద్ ఉన్ నబీ పండుగను ముస్లీంలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా వరికుంటపాడు, తూర్పుబోయమడగల, హుస్సేన్‌నగర్, తిమ్మారెడ్డిపల్లి, విరువూరు, కొత్తపల్లి, తోటలచెరువుపల్లి తదితర గ్రామాల్లోని మసీదుల్లో ప్రత్యేక ప్రార్ధనలు చేపట్టారు. అలాగే సీతారామపురం మండలంలో వేడులకను ఘనంగా నిర్వహించారు.
అనంతసాగరం : మండలంలోని సోమశిల, అనంతసాగరం, పాతదేవరాయపల్లి, ఆమనిచిరివేళ్ల, గౌరవరం, ఉప్పలపాడు, కచ్చేరిదేవరాయపల్లి గ్రామాల్లో మిలాదున్నబి వేడుకలు గురువారం ముస్లిం సోదరులు భక్తిశ్రద్థలతో నిర్వహించారు. అనంతసాగరంలో ఆకుపచ్చ జెండాలతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మదపెద్దలు పాల్గొన్నారు.