ఇళ్ల నిర్మాణాలపై సమగ్ర విచారణ జరపండి
ABN , First Publish Date - 2023-11-20T22:57:58+05:30 IST
జగనన్న కాలనీ ఇళ్లలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించి, అందుకు బాఽధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం వారు

ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా
బయటకు వెళతారా.. లేదా ? : సీఐ బెదిరింపు
కావలి, నవంబరు20: జగనన్న కాలనీ ఇళ్లలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించి, అందుకు బాఽధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం వారు ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్డీవో శీనానాయక్‌కు వినతిపత్రం అందచేశారు. అనంతరం వేదిక కన్వీనర్ కే. భాస్కర్, సభ్యులు జ్యోతి బాబూరావు, పసుపులేటి పెంచలయ్య, రిషికేష్, నాగరాజు మాట్లాడుతూ జగనన్న ఇళ్లు అవినీతి పునాదులపై నిర్మితమవుతున్నాయన్నారు. కొద్దిపాటి వర్షానికే ఇళ్ల గోడలు కూలిపోయాయంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో తెలుస్తోందన్నారు. ఇళ్ల నిర్మాణంలో ఎమ్మెల్యే సారథ్యంలో సుమారు రూ.150 కోట్ల వరకు అవినీతి జరిగిందన్నారు. ఈ విషయమై సమగ్ర విచారణ జరపాలన్నారు.
సీఐ బెదిరింపులు
ఆర్డీవోను కలవటానికి వచ్చిన వేదిక సభ్యులను రూరల్ సీఐ రాజేష్ బెదిరించారు. ధర్నా చేసేందుకు సిద్ధం కాగా ఇక్కడ ధర్నా చేసేందుకు వీలులేదని, బయటకు వెళ్లి నిరసన తెలుపుకోమని హెచ్చరించారు. బయటకు వెళ్లకపోతే పోలీస్ వాహనం ఎక్కిస్తామని బెదిరించారు. కనీసం నిరసన తెలుపుకునే హక్కును కూడా కాలరాస్తున్న సీఐపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వేదిక సభ్యులు పసుపులేటి మహేష్, గోసల రవికాంత్, గడే నాగార్జున, తోట చరణ్, కల్యాణి, వేణు, మస్తాన్, సునీల్, రఫీ తదితరులు పాల్గొన్నారు.
------------