ఎక్కడంటే అక్కడ చెత్త వేయొద్దు

ABN , First Publish Date - 2023-09-25T22:50:04+05:30 IST

: ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, ఇళ్ల వద్దే తడి,పొడి,ప్రమాదకర చెత్తను వేరు చేసి పారిశుధ్య కార్మికులకు అందజేయాలని నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ మోర్ల సుప్రజ, కమిషనర్‌ లింగారెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. సోమవారం బుచ్చిలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నుంచి స్వచ్ఛత సహిత సేవా కార్యక్రమంలో భాగంగా ర్యాలీ

 ఎక్కడంటే అక్కడ చెత్త వేయొద్దు
4బీఆర్‌పీ25 : బుచ్చిలో నిర్వహించిన స్వచ్ఛతా ర్యాలీ

బుచ్చిరెడ్డిపాళెం,సెప్టెంబరు25: ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, ఇళ్ల వద్దే తడి,పొడి,ప్రమాదకర చెత్తను వేరు చేసి పారిశుధ్య కార్మికులకు అందజేయాలని నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ మోర్ల సుప్రజ, కమిషనర్‌ లింగారెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. సోమవారం బుచ్చిలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నుంచి స్వచ్ఛత సహిత సేవా కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో వైసీపీ నాయకులు కోడూరు మధుసూదన్‌రెడ్డి, 15వవార్డు కౌన్సిలర్‌ అనంతమ్మ, తదితరులు పాల్గొన్నారు.

-----------------

Updated Date - 2023-09-25T22:50:04+05:30 IST