దేశాన్ని కాపాడే శక్తి కాంగ్రెస్‌కే...
ABN , First Publish Date - 2023-02-21T21:18:52+05:30 IST
దేశాన్ని కాపాడకలిగినశక్తి కాంగ్రెస్‌కే ఉందని ఏఐసీసీ సభ్యుడు చేవూరు దేవకుమార్‌రెడ్డి అన్నారు. పడుగుపాడులో మంగళవారం జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్‌గాంధీ పాదయాత్ర
కోవూరు, ఫిబ్రవరి21: దేశాన్ని కాపాడకలిగినశక్తి కాంగ్రెస్‌కే ఉందని ఏఐసీసీ సభ్యుడు చేవూరు దేవకుమార్‌రెడ్డి అన్నారు. పడుగుపాడులో మంగళవారం జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్‌గాంధీ పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీకి దేశంలో బలం చేకూరిందన్నారు. బీజేపీ అనుసురిస్తున్న మతతత్వ విధానాల వల్ల ప్రజలు కాంగ్రెసు పార్టీకి మద్దతు పలుకుతున్నారని చెప్పారు. మండల కమిటీ అధ్యక్షుడు గొట్టిగుండాల మహేశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ నాయకులు మల్లికార్జునరెడ్డి, ధనుంజయ తదితరులు మాట్లాడారు.