Share News

దెబ్బతిన్న పంటల పరిశీలన

ABN , First Publish Date - 2023-12-05T23:06:59+05:30 IST

తుఫాన్‌తో దెబ్బతిన్న పంటలను మంగళవారం వ్యవసాయాధికారి రవికుమార్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీ.కొండారెడ్డిపల్లి, తోటలచెరువుపల్లి, కనియంపాడు గ్రామాల్లో కోత దశలో ఉన్న 90 ఎకరా

దెబ్బతిన్న పంటల పరిశీలన
5వీకేపీ6: వరి పంటను పరిశీలిస్తున్న ఏవో రవికుమార్‌

వరికుంటపాడు, డిసెంబరు 5: తుఫాన్‌తో దెబ్బతిన్న పంటలను మంగళవారం వ్యవసాయాధికారి రవికుమార్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీ.కొండారెడ్డిపల్లి, తోటలచెరువుపల్లి, కనియంపాడు గ్రామాల్లో కోత దశలో ఉన్న 90 ఎకరాల వరి పంట నీట మునిగి దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు. అలాగే కనియంపాడులో మొక్కజొన్న, మిరప, మినుము పంటలు సైతం దెబ్బతిన్నాయన్నారు. వీఏఏల ద్వారా ప్రతి పంటను క్షుణ్ణంగా పరిశీలించి ఎప్పటికప్పుడు నివేదికలను ఉన్నతాధికారులకు అందజేస్తున్నామన్నారు.

---------

Updated Date - 2023-12-05T23:07:00+05:30 IST