ధాన్యం, వరి గడ్డి దగ్ధం

ABN , First Publish Date - 2023-02-27T21:39:53+05:30 IST

మరికొద్ది గంటల్లో ధాన్యం ఇంటికి చేరుతున్న సమయంలో అగ్నికి అహుతి అయ్యాయి. దీంతో ఆ రైతుకు కన్నీళ్లే మిగిలాయి. ఈ సంఘటన సోమవారం ఉదయగిరి మండలం ఆర్లపడియలో చోటుచేసుకొంది. గ్రామానికి చెందిన ముట్టుకుందు చిన్నపరెడ్డి 1.50 ఎకరాల్లో వరి సాగు చేశాడు. పంట కోసి పొలంలో ట్రాక్టర్‌ సహాయం

 ధాన్యం, వరి గడ్డి  దగ్ధం
27యుడిజిఆర్‌1: కాలిపోయిన వరిపైరును పరిశీలిస్తున్న వీఆర్వో మస్తాన్‌

ఉదయగిరి రూరల్‌, ఫిబ్రవరి 27: మరికొద్ది గంటల్లో ధాన్యం ఇంటికి చేరుతున్న సమయంలో అగ్నికి అహుతి అయ్యాయి. దీంతో ఆ రైతుకు కన్నీళ్లే మిగిలాయి. ఈ సంఘటన సోమవారం ఉదయగిరి మండలం ఆర్లపడియలో చోటుచేసుకొంది. గ్రామానికి చెందిన ముట్టుకుందు చిన్నపరెడ్డి 1.50 ఎకరాల్లో వరి సాగు చేశాడు. పంట కోసి పొలంలో ట్రాక్టర్‌ సహాయంతో నూర్పిడి చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. గ్రామస్థులు మంటలను అదుపు చేయడంతోపాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో ధాన్యం, వరి గడ్డి, పట్టలు కాలిపోవడంతో రూ.లక్ష నష్టపోయినట్లు బాధిత రైతు పేర్కొన్నాడు. సంఘటనా స్థలాన్ని వీఆర్వో మస్తాన్‌ పరిశీలించారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని రైతు వేడుకొంటున్నాడు.

---------------

Updated Date - 2023-02-27T21:39:54+05:30 IST