అభివృద్ధిని మరచి. డబ్బుతోనే సీఎం జగన్ రాజకీయాలు
ABN , First Publish Date - 2023-11-19T23:51:04+05:30 IST
రాష్ట్ర అభివృద్ధిని మరచి.. డబ్బుతోనే సీఎం జగన్మోహన్‌రెడ్డి రాజకీయాలు చేయాలనుకుంటున్నాడని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు.

సైదాపురం, నవంబరు 19: రాష్ట్ర అభివృద్ధిని మరచి.. డబ్బుతోనే సీఎం జగన్మోహన్‌రెడ్డి రాజకీయాలు చేయాలనుకుంటున్నాడని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో టీడీపీ, జనసేన ఉమ్మడి సారథ్యంలో ‘గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్వానంగా ఉన్న సైదాపురం-పొదలకూరు రెండు మండలాలను కలిపే ప్రధాన ఆర్‌అండ్‌బీ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. అనంతరం కురుగొండ్ల మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కట్టా మోహన్‌కృష్ణారెడ్డి, క్లస్టర్ ఇన్‌చార్జి పెమ్మసాని దిలీప్‌చౌదరి, నియోజకవర్గ పరిశీలకుడు జెన్ని రమణయ్య, నియోజక వర్గ జనసేన ఇన్‌చార్జి గూడూరు వెంకటేశ్వర్లు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ రైతు ఉపాధ్యక్షుడు కొండూరు సుబ్రహ్మణ్యం రాజు, టీడీపీ మండల ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రాజు, రైతు మండల అధ్యక్షుడు కేపీ రాజు, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.
తోటపల్లిగూడూరు : వైసీపీ ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నాయని టీడీపీ మండల అధ్యక్షుడు సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్‌నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని కోడూరు బీచ్ రహదారి మార్గంలో ఆదివారం టీడీపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో నియోజకవర్గంలో గుంతలమయంగా మారిన రహదారులపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. ప్రధాన పర్యాటక కేంద్రంగా మారిన కోడూరు బీచ్ రోడ్డులోని గుంతలు మంత్రికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి రోడ్ల మరమ్మతులకు రూ.21కోట్లు కేటాయించామని చెప్పడం జరిగిందని.. ఆ పనులు ఎప్పుడు చేస్తారో అర్థం కావడంలేదన్నారు. కాగా రాష్ట్రంలో పర్యాటక మంత్రి ఉన్నారో లేదో తెలియడం లేదన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాసులు, సీహెచ్ మల్లికార్జుననాయుడు, చింత సీతారామయ్య, ఊటుకూరు శ్రీనివాసులు, ఊటుకూరు అవినాష్, జనసేన మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నడవల రవికుమార్, శరత్, కాపు నేస్తం ప్రతినిధి వాణి భవాని, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.