చిన్నశేషుడిపై వెంకయ్య విహారం
ABN , First Publish Date - 2023-08-22T00:08:20+05:30 IST
గొలగమూడిలో జరుగుతున్న ఆరాధనోత్సవాల్లో భాగంగా సోమవారం వెంకయ్యస్వామికి చినశేష, గజవాహన సేవలు జరిగాయి.
వెంకటాచలం, ఆగష్టు 21 : గొలగమూడిలో జరుగుతున్న ఆరాధనోత్సవాల్లో భాగంగా సోమవారం వెంకయ్యస్వామికి చినశేష, గజవాహన సేవలు జరిగాయి. వేకువజామున గోపూజతోనిత్య పూజలు మొదలయ్యాయి. అనంతరం సుప్రభాత సేవ, అభిషేకము, పూజ, హారతి, ప్రసాద వినియోగము, ఉత్సవ విగ్రహానికి అభిషేకము, సహస్రనామార్చనలు జరిగాయి. ఉదయం 10 గంటలకు ఆశ్రమ ఈవో బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో చినశేష వాహనసేవ నిర్వహించారు. రాత్రికి గజవాహన సేవ నేత్ర పర్వంగా జరిగింది. సేవలను తిలకించడానికి భక్తులు తండోపతండాలుగా వచ్చారు. ఊరేగింపు ముందు ఏర్పాటు చేసిన పలు రకాల వాయిద్యాలు భక్తులను ఉత్సాహపరిచాయి. వెంకయ్య స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఉత్సవాల్లో నేడు
ఉత్సవాల్లో ఐదవ రోజు మంగళవారం ఉదయం అశ్వవాహనం, రాత్రి పెద్దశేష వాహన సేవలు జరుగుతాయని ఈవో బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.
=============