చెత్తను కేంద్రాలకు తరలించే బాధ్యత అధికారులదే!

ABN , First Publish Date - 2023-03-17T23:42:32+05:30 IST

ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను ఇతర ప్రదేశాలకు కాకుండా నేరుగా కేంద్రాలకు తరలించాల్సిన బాధ్యత అధికారులదేనని ఇన్‌చార్జి డీపీవో చిరంజీవి అన్నారు.

చెత్తను కేంద్రాలకు తరలించే బాధ్యత అధికారులదే!
చెత్తసంపద తయారీ కేంద్రంను పరిశీలిస్తున్న ఇన్‌చార్జి డీపీవో చిరంజీవి

మనుబోలు, మార్చి 17: ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను ఇతర ప్రదేశాలకు కాకుండా నేరుగా కేంద్రాలకు తరలించాల్సిన బాధ్యత అధికారులదేనని ఇన్‌చార్జి డీపీవో చిరంజీవి అన్నారు. స్థానిక చెత్తసం పద తయారీ కేంద్రంను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 495 పంచాయతీల్లో చెత్త సంపద కేంద్రాలు ఉండగా, 480 కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేశామన్నారు. 380 కేంద్రాల్లో వర్మికంపోస్టు తయారీ అమ్మకంతో పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరుతోందన్నారు. మనుబోలు కేంద్రా న్ని ఒక మోడల్‌గా తయారు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటే శ్వర్లు, ఈవోఆర్‌డీ రమణయ్య, కార్యదర్శి రమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-17T23:42:32+05:30 IST