చెరువు కలుజుపై బ్రిడ్జి నిర్మించాలి

ABN , First Publish Date - 2023-04-10T23:49:50+05:30 IST

కోవూరు చెరువు కలుజుపై బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ బ్రిడ్జి నిర్మాణ పోరాట సమితి ఆఽధ్వర్యంలో సోమవారం పట్టణంలో ఆందోళన నిర్వహించారు.

చెరువు కలుజుపై బ్రిడ్జి నిర్మించాలి

10 కేవీఆర్‌1ః కోవూరులో ఆందోళన చేస్తున్న సీపీఎం నాయకులు

కోవూరు, ఏప్రిల్‌ 10: కోవూరు చెరువు కలుజుపై బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ బ్రిడ్జి నిర్మాణ పోరాట సమితి ఆఽధ్వర్యంలో సోమవారం పట్టణంలో ఆందోళన నిర్వహించారు. స్థానిక మందబయలు కూడలి నుంచి బజారు కూడలి వరకు ప్రదర్శన చేసి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కమిటీ కార్యదర్శి గండవరపు శేషయ్య మాట్లాడుతూ కోవూరు, బుచ్చిరెడ్డిపాళెం, కొడవలూరు మండలాల పరిధిలోని ఏడు గ్రామాల ప్రజలు వర్షాకాలంలో తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారని, రాబోయే వర్షాకాలం లోగా కలుజుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. అనంతరం తహసీల్దారు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు బాబు, మారుబోయిన సుబ్బారావు. సురేంద్ర, సురేష్‌, పెద్దబ్బయ్య, విజయకుమార్‌, హరి, చాంద్‌బాషా, కాలేష, మల్లికార్జునరెడ్డి, ఖాదర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

=========

Updated Date - 2023-04-10T23:49:50+05:30 IST