Share News

బుచ్చిలో ఆంగ్ల సంవత్సర వేడుకలు

ABN , Publish Date - Dec 31 , 2023 | 09:29 PM

బుచ్చి నగర పంచాయతీతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆంగ్ల సంవత్సరాది వేడుకలు ప్రారంభం అయ్యాయి. యువకులు, చిన్నారులు 2023 సంవత్సరానికి వీడ్కోలు పలికి 2024కి

బుచ్చిలో ఆంగ్ల సంవత్సర వేడుకలు
1బీఆర్‌పీ31 : కేకులు కొనుగోలు చేస్తున్న ప్రజలు

బుచ్చిరెడ్డిపాళెం, డిసెంబరు31: బుచ్చి నగర పంచాయతీతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆంగ్ల సంవత్సరాది వేడుకలు ప్రారంభం అయ్యాయి. యువకులు, చిన్నారులు 2023 సంవత్సరానికి వీడ్కోలు పలికి 2024కి స్వాగతం పలికారు. కేక్‌లు కట్‌ చేసి, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సెల్‌ఫోన్లలో హ్యాపీ న్యూయర్‌ సందేశాలు పంపుకున్నారు. బుచ్చిలోని జాతీయ రహదారి వెంబడి వివిధ ఆఫర్లతో కేకులు, బొకేల అంగళ్లు వెలశాయి. మందు బాబుల కోసం హోటళ్ల నిర్వాహకులు పలు మాంసాహార పదార్థాలను సిద్ధం చేశారు. అలాగే పలుచోట్ల మద్యం బెల్టు దుకాణాలు వెలిశాయి. వాటిల్లో అధిక ధరలకు మద్యం విక్రయించారు.

Updated Date - Dec 31 , 2023 | 09:29 PM