బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రచారం

ABN , First Publish Date - 2023-02-21T21:17:16+05:30 IST

మండలంలోని చౌటపాలెం పంచాయతీ సరస్వతీ నగర్‌ వద్ద ఉన్న అక్షర విద్యాలయం, రవీంద్రభారతి

 బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి  ప్రచారం
21వీకేటీ 1 : మాట్లాడుతున్న ఎమ్మెల్యీ అభ్యర్ధి దయాకర్‌రెడ్డి

వెంకటాచలం, ఫిబ్రవరి 21: మండలంలోని చౌటపాలెం పంచాయతీ సరస్వతీ నగర్‌ వద్ద ఉన్న అక్షర విద్యాలయం, రవీంద్రభారతి పాఠశాలలను మంగళవారం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేంద్రరెడ్డితో కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్ధి సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి సందర్శించారు. ఆయా పాఠశాలల్లోని పట్టభద్రులతో సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దయాకర్‌రెడ్డిని గెలిపించాలని సురేంద్రరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కే శ్రీనివాసులు యాదవ్‌, వంశీధర్‌రెడ్డి, ఆలూరు ప్రసాద్‌నాయుడు, పీ పెంచలయ్య, గొత్తల నరేష్‌, హసనాపురం శ్రీనివాసులు, కరీముల్లా, దయాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T21:17:17+05:30 IST