విద్యుత్‌ బిల్లులు చెల్లించాల్సిందే !

ABN , First Publish Date - 2023-03-25T22:52:35+05:30 IST

అసలే అరకొర నిధులతో పంచాయతీల్లో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. దీనికి తోడు విద్యుత్‌ బిల్లుల బకాయిలు చెల్లించాలంటూ ఉన్నతాధికారులు పంచాయతీ కార్యదర్శులకు ఫోన్లు, వాట్సప్‌ సందేశాలు పంపుతున్నారు. దీంతో ఏమి చేయాలో దిక్కు తెలియక వారు తలలు పట్టుకుంటున్నారు. గతం

 విద్యుత్‌ బిల్లులు చెల్లించాల్సిందే !
1సీజేఎల్‌25: మస్తాన్‌

పంచాయతీ కార్యదర్శులకు తాఖీదులు

వాట్సప్‌లో అధికారుల సందేశం

చేజర్ల, మార్చి25: అసలే అరకొర నిధులతో పంచాయతీల్లో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. దీనికి తోడు విద్యుత్‌ బిల్లుల బకాయిలు చెల్లించాలంటూ ఉన్నతాధికారులు పంచాయతీ కార్యదర్శులకు ఫోన్లు, వాట్సప్‌ సందేశాలు పంపుతున్నారు. దీంతో ఏమి చేయాలో దిక్కు తెలియక వారు తలలు పట్టుకుంటున్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ బకాయిల పేరుతో గ్రామ పంచాయతీల అనుమతులు లేకుండా అర్థిక సంఘం నిధులను దారి మళ్లించింది. దీంతో సొంత ఆదాయ వనరులు బాగున్న కొన్ని పంచాయతీలలో తప్ప మిగిలిన చోట్ల అభివృద్ధి పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం అధికారుల ఆదేశాలతో సర్పంచులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సొంత నిధులు వినియోగిస్తున్నాం

గ్రామ పంచాయతీల నిధుల కోసం ఎదురుచూస్తూనే ఉన్నాం. విడుదల కాకపోవడంతో అత్యవసర పనులకు సొంత నిధులను వాడుతున్నాం. నెలల తరబడి సిబ్బంది జీతాలు కూడా ఇవ్వలేదు. పంచాయతీలకు నిధులు వస్తాయన్న సమాచారంతో అధికారులు విద్యుత్‌ బకాయిలు అంటూ ఒత్తిడి చేయడం ఎంతవరకు సబబు.?

--మస్తాన్‌, సర్పంచి, నాగులవెల్లటూరు

Updated Date - 2023-03-25T22:52:35+05:30 IST