Share News

బీసీలకు నమ్మక ద్రోహం

ABN , First Publish Date - 2023-11-09T23:08:32+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నమ్మకద్రోహం చేసిందని టీడీపీ డాక్టర్స్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జెడ్‌ శివప్రసాద్‌, బీసీ రాష్ట్ర నేత పీఎల్‌ రావు విమర్శించారు.

బీసీలకు నమ్మక ద్రోహం
మాట్లాడుతున్న పీఎల్‌ రావు

నెల్లూరు(వైద్య్యం), నవంబరు 9 : రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నమ్మకద్రోహం చేసిందని టీడీపీ డాక్టర్స్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జెడ్‌ శివప్రసాద్‌, బీసీ రాష్ట్ర నేత పీఎల్‌ రావు విమర్శించారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో గురువారం సాయంత్రం బీసీ ఐక్యపోరాట సదస్సుకు సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ నెల 17న బీసీ సంఘాల సదస్సు పెద్దఎత్తున జరుగుతుందన్నారు. బీసీ కులసంఘాలు, ప్రజాసంఘాలు, అఖిలపక్ష రాజకీయ పార్టీలను కలుపుకుని సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చెంచలబాబు యాదవ్‌, రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, బీసీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తల హరికృష్ణ మాట్లాడుతూ అణగారిన బీసీ కులాలలో చైతన్యం తీసుకు వచ్చేందుకు టీడీపీ ఎంతో కృషి చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజెర్ల వెంకటేశ్వరరెడ్డి, బీసీసెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు, ఆబ్కాస్‌ మాజీ చైర్మన్‌ కొండూరు పాలిశెట్టి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అన్నం దయాకర్‌ గౌడ్‌, బీసీసెల్‌ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి మునిస్వామి, బీసీసెల్‌ జిల్లా అధికార ప్రతినిధి ఉప్పు భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-09T23:08:35+05:30 IST