హోరాహోరీగా అంతర్‌జిల్లా బాల్ బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు
ABN , First Publish Date - 2023-03-18T22:27:58+05:30 IST
కావలి మద్దూరుపాడులోని డీబీఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్‌జిల్లాల బాలబాలికల బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు రెండోరోజు శనివారం హోరాహోరీగా జరిగాయి. బాలబాలికల విభాగా

కావలిటౌన్, మార్చి18: కావలి మద్దూరుపాడులోని డీబీఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్‌జిల్లాల బాలబాలికల బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు రెండోరోజు శనివారం హోరాహోరీగా జరిగాయి. బాలబాలికల విభాగాల్లో క్వార్టర్ ఫైనల్స్ పోటీ జరగ్గా, బాలికల విభాగంలో నెల్లూరు, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల జట్లు గెలుపొంది సెమీఫైనల్స్‌కు చేరాయి. బాలుర విభాగంలో ప్రకాశం, కర్నూలు, కృష్ణా జిల్లా జట్లు విజయం సాధించి సెమీఫైనల్స్‌కు చేరాయి. ఆదివారం సెమీఫైనల్స్, ఫైనల్స్ జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలను బాల్‌బ్యాంట్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విజయశంకర్‌రెడ్డి పర్యవేక్షించారు.
---------