చంద్రబాబును విమర్శస్తే సహించం
ABN , First Publish Date - 2023-12-06T22:03:20+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని విమర్శిస్తే సహించమని టీడీపీ నేతలు మాతూరు శ్రీనివాసులురెడ్డి, చెముకుల శ్రీనివాసులు తెలిపారు. విడవలూరులోని పార్టీ కార్యాలయంలో బుధవారం వారు విలేకరులతో మా
విడవలూరు, డిసెంబరు 6: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని విమర్శిస్తే సహించమని టీడీపీ నేతలు మాతూరు శ్రీనివాసులురెడ్డి, చెముకుల శ్రీనివాసులు తెలిపారు. విడవలూరులోని పార్టీ కార్యాలయంలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి చేతకాని తనం వల్ల కాలువలు పూడిక తీయకపోవటంతో వర్షాలకు వందల ఎకరాల్లో నారుమళ్లు మునిగిపోయాయన్నారు. గ్రామాల్లో తాగునీరు లేదని అన్నారు. తుఫాన్ ప్రాంతాల్లో పర్యటించకుండా చంద్రబాబును విమర్శించడం సరికాదన్నారు. పార్లపల్లిలో టీడీపీ సర్పంచు ఆఽధ్వర్యంలో వరద బాధితులను ఆదుకున్నామన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు సత్యవోలు సత్యంరెడ్డి, ఇమాంబాష, రామశెట్టి వెంకటేశ్వర్లు, తాతా బాలకృష్ణ, సుబ్రహ్మణ్యం, డక్కా భాస్కర్, చలంచర్ల కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
-------------