Share News

ప్రభుత్వంతో అంగన్‌వాడీల కబడ్డీ

ABN , Publish Date - Dec 30 , 2023 | 11:05 PM

: సమ్మెలో భాగంగా శనివారం ఆర్డీవో కార్యాలయం ఎదురుగా అంగన్‌వాడీలు కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. 19వ రోజు దీక్షా శిబిరాన్ని సీఐటీయూ సీనియర్‌ నాయకులు నరహరి, తుమ్మల వెంకయ్యలు ప్రారంభించారు. వారు

ప్రభుత్వంతో అంగన్‌వాడీల కబడ్డీ
30కెడికె2 : కందుకూరు : మానవహారం ఏర్పాటుచేసి రాస్తారోకో చేస్తున్న అంగన్‌వాడీలు

కావలిటౌన్‌, డిసెంబరు30 : సమ్మెలో భాగంగా శనివారం ఆర్డీవో కార్యాలయం ఎదురుగా అంగన్‌వాడీలు కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. 19వ రోజు దీక్షా శిబిరాన్ని సీఐటీయూ సీనియర్‌ నాయకులు నరహరి, తుమ్మల వెంకయ్యలు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ అంగన్‌వాడీల సమ్మెను ప్రభుత్వం ఆలకించాలని, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నేతలు పెంచులయ్య, కృష్ణమోహన్‌, యనియన్‌ నేతలు రఘురవమ్మ, సుభాషిణీ, విజయలత తదితరులు పాల్గొన్నారు.

అకట్టుకున్న కబడ్డీ

ఆర్డీవో కార్యాలయం ఎదురుగా ఉన్న శిబిరంలో ఆడుదాం ఆంధ్రా అంటూ అంగన్‌వాడీలు సీఎం,ఇతర మంత్రుల పేర్లతో ఫ్లకార్డులు ధరించి మంత్రివర్గం ఓ జట్టుగా, అంగన్‌వాడీలు మరో జట్టుగా కబడ్డీ ఆడారు. ఇది చూపరులను ఎంతో ఆకట్టుకుంది. సీఎం, మంత్రుల పేర్లతో ఉన్నవారు కూతకొచ్చినప్పుడు వారిని అంగన్‌వాడీలు పట్టుకుని మా సమస్యలు పరిష్కరిస్తారా లేదా అని ప్రశ్నించారు.కాగా మంత్రివర్గ జట్టుపై అంగన్‌వాడీల జట్టు విజయం సాధించింది.

లింగసముద్రం : తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండలంలోని అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాలు శనివారం మండలంలోని ఆయా సచివాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వర్కర్లు సీహెచ్‌ రమాదేవి, ప్రభావతి, ఎన్‌ సుగుణమ్మ, వై కృష్ణకుమారి మాట్లాడారు. కార్యక్రమంలో టీ సరోజిని, పీ శ్రీదేవి, డీ కుమారి, పీ ధనలక్ష్మి, మధులత, కే నారాయణమ్మ, ఈ వెంకట లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

కొండాపురం : న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ మండల పరిధిలోని అంగన్‌వాడీలు శనివారం సచివాలయ అధికారులకు వినతిపత్రం అందచేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియచేయాలని కోరారు.

-------------

Updated Date - Dec 30 , 2023 | 11:05 PM