28న కళాశాలల బంద్‌ : ఏబీవీపీ

ABN , First Publish Date - 2023-07-25T23:45:01+05:30 IST

రాష్ట్రంలోని జూనియర్‌ కళాశాలల్లో నెలకొన్న సమస్యలపై ఈనెల 28న రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్‌ కళాశాలల బంద్‌ పాటిస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజశేఖర్‌ తెలిపారు.

28న కళాశాలల బంద్‌ : ఏబీవీపీ
పోస్టర్లు ఆవిష్కరిస్తున్న ఏబీవీపీ నాయకులు

నెల్లూరు (విద్య), జూలై 25 : రాష్ట్రంలోని జూనియర్‌ కళాశాలల్లో నెలకొన్న సమస్యలపై ఈనెల 28న రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్‌ కళాశాలల బంద్‌ పాటిస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజశేఖర్‌ తెలిపారు. మంగళవారం నెల్లూరులోని ఆర్‌ఐవో కార్యాలయం ఎదుట బంద్‌కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలల్లో ఫీజుల దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవ డంలేదని, ప్రభుత్వ కళాశాలల్లో వసతులు సైతం కల్పించడం లేదని విమర్శించారు. వసతులు, పుస్తకాలు లేకుండా బోధనా ఎలా సాగుతుందని ప్రశ్నించారు. వీటితోపాటు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యల పరిష్కారం కోసం ఈనెల 28న నిర్వహించే బంద్‌కు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాహుల్‌, నగర సహాయ కార్యదర్శులు సాయి, నరసింహ, బాలాజీ, నాయకులు సమీర్‌, సుమన్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-25T23:45:01+05:30 IST