20 అవార్డులు సాధించిన డెంటిస్టు కావ్య
ABN , Publish Date - Dec 31 , 2023 | 09:25 PM
మనుబోలుకి చెందిన దంత వైద్యురాలు డాక్టర్ కావ్య నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలలో జరిగిన గ్రాడ్యుయేష
మనుబోలు, డిసెంబరు 31: మనుబోలుకి చెందిన దంత వైద్యురాలు డాక్టర్ కావ్య నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకలో 20 అవార్డులు అందుకున్నారు. ఆమె 2018లో బీడీఎస్‌లో చేరారు. 3వ ఏడాది పబ్లిక్ హెల్త్ డెంటిస్టరీ విభాగంలో స్టేట్‌పస్ట్ అవార్డు, నాలుగవ ఏడాదిలో స్టేట్‌లో 9వ స్థానంలో అవార్డు, జిల్లా స్థాయిలో నాలుగు విభాగాల్లో 16అవార్డులతోపాటు, వ్యక్తిగత ప్రవర్తనలో బెస్ట్ అవుట్‌గోయింగ్ అవార్డును, వైద్యురాలిగా పట్టాను డెంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ అజయ్‌వెజనాల్, డీన్ శివకుమార్, హెచ్‌వోడీ లావ్యణ అనుమోలా, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనువాసులు తదితరుల నుంచి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు.