ముస్లింల ద్రోహి జగన్మోహన్‌రెడ్డి : మాలేపాటి
ABN , First Publish Date - 2023-09-24T23:04:19+05:30 IST
ముస్లిం పథకాలను తుంగలో తొక్కిన ముస్లిం మైనార్టీల ద్రోహి సీఎం జగన్మోహన్‌రెడ్డి అని టీడీపీ కావలి ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు తెలిపారు.

కావలి, సెప్టెంబరు 24: ముస్లిం పథకాలను తుంగలో తొక్కిన ముస్లిం మైనార్టీల ద్రోహి సీఎం జగన్మోహన్‌రెడ్డి అని టీడీపీ కావలి ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా ఆదివారం టీడీపీ కార్యాలయం వద్ద 11వ రోజు రిలే నిరసన దీక్షలు కొనసాగాయి. ఈ దీక్షలో ముస్లిం మైనార్టీ నేతలు, మహిళలు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు మద్దతుగా ముస్లిం మైనార్టీ మహిళలు దీక్ష చేపట్టి సంఘీభావం తెలపటం బాబు అక్రమ అరెస్ట్‌తో ప్రజల్లో పెరుగుతున్న సానుభూతికి నిదర్శనమన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన దుల్హాన్ పథకం, రంజాన్ తోఫా, దుకాస్ మకాన్ వంటి పథకాలను రద్దు చేసి జగన్ అన్యాయం చేశారన్నారు.
వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయి : బొల్లినేని
కలిగిరి : వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయని, 2024లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు తెలిపారు. పార్టీ మండల కన్వీనర్ బి.వెంకట క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో చేస్తున్న దీక్షలో ఆదివారం ఆయన పాల్గొని మాట్లాడుతూ చంద్రబాబునాయుడుపై వైసీపీ అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టినంతమాత్రాన వైసీపీ తిరిగి అధికారంలోకి రాలేదన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ కాకు మహేష్, వేళ్ల నరేంద్ర, కట్టా వెంకటేశ్వర్లు, కొండపల్లి వెంకటరావు, సీహెచ్.జయరామిరెడ్డి, బొగ్గవరపు వేణు, జే.పెద్ద అంకిరెడ్డి, సీహెచ్.తాతయ్య, మాదాల శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
సీఎం జగన్ జీవితమే అవినీతి, మోసాలు : ఇంటూరి
కందుకూరు : సీఎం జగన్మోహన్‌రెడ్డి జీవితమంతా మాయలు, మోసాలు, అవినీతి, అబద్ధాలేనని టీడీపీ కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును అక్రమ అరెస్టును నిరసిస్తూ కందుకూరులో చేపట్టిన రిలే దీక్షలు 11వ రోజు ఆదివారం కొనసాగాయి. ఈ దీక్షలలో ముస్లిం మైనారిటీ, నూర్‌బాషా కమిటీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ రాజకీయాల్లో దోపిడీ, అవినీతికి ల్యాండ్‌మార్క్‌గా ఉన్న జగన్మోహన్‌రెడ్డి అందరిపై అదే బురద జల్లాలన్న సైకో ఆలోచనతో చంద్రబాబునాయుడుపై దుర్మార్గంగా అక్రమ కేసు బనాయించారని విమర్శించారు. ప్రభుత్వ వైద్యశాలలో వైద్యసేవలు సక్రమంగా లేవని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వారిని ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తున్నారని, ఇలాంటి తాటాకుచప్పుళ్లకు బెదిరేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దామా మల్లేశ్వరరావు, చల్లా శ్రీనివాసరావు, షేక్ నాయబ్‌రసూల్, షేక్ రఫి, షేక్ మున్నా, షేక్ సలాం, షేక్ ఫిరోజ్, మాబాషా, ఖలీల్, నాగూర్, రూబీ, జియావుద్ధీన్, గోచిపాతల మోషే తదితరులు పాల్గొన్నారు.