Share News

ఒకటి నుంచి రైతు నేస్తం అమలు

ABN , First Publish Date - 2023-11-21T21:28:55+05:30 IST

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా డిసెంబరు 1 నుంచి 15 వరకు రైతు నేస్తం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు డీసీసీబీ సీఈవో సరిత తెలిపారు. మంగళవారం వింజమూరు సొసైటీని ఆమె సందర్శించారు. అనంతరం సొసైటీ చైర్మన్‌ మలిరెడ్డి విజయ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

  ఒకటి నుంచి రైతు నేస్తం అమలు
1వీఎన్‌జే 21 : సీఈవో సరితకు పుష్పగుచ్ఛం అందచేస్తున్న సొసైటీ చైర్మన్‌

వింజమూరు, నవంబరు 21 : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా డిసెంబరు 1 నుంచి 15 వరకు రైతు నేస్తం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు డీసీసీబీ సీఈవో సరిత తెలిపారు. మంగళవారం వింజమూరు సొసైటీని ఆమె సందర్శించారు. అనంతరం సొసైటీ చైర్మన్‌ మలిరెడ్డి విజయ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ముందుగా ఆత్మకూరు, ఉదయగిరి, సంగం, వింజమూరు సొసైటీల పరిధిలోని సీఈవోలతో సమీక్ష నిర్వహించారు. ప్రకాశం డీసీసీబీ ద్వారా రూ.2వేల కోట్లతో వ్యాపారం సాగుతుందని, ఇలాగే జిల్లాలో కొనసాగించాలని తెలిపారు. సొసైటీల ద్వారా కరెంటు ఖాతాలు, ఎస్బీ ఖాతాలు, జీరో అకౌంట్‌ ఖాతాలను ప్రారంభించేందుకు రైతులకు అవకాశం ఉందని తెలిపారు. ఖాతా తెరిచిన వారికి ఫ్రీ ఇన్సూరెన్స్‌ ఉంటుందన్నారు. రైతు నేస్తం ద్వారా రూ.330 చెల్లించి ఖాతా తీసుకోవాలని తెలిపారు. కిసాన్‌ రుణమేళా ద్వారా దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలను అందజేస్తున్నట్లు తెలిపారు. డిపాజిట్లపై అధిక వడ్డీని అందజేస్తున్నట్లు చెప్పారు. విద్య, గృహ, వాహన రుణాలు కూడా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. అనంతరం సీఈవో సరితను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎంలు శ్రీనివాసరెడ్డి, అహ్మద్‌బాషా, రమేష్‌, సెక్షన్‌ ఆఫీసర్‌ శ్రీవిద్య, స్థానిక బ్యాంకు చీప్‌ మేనేజర్‌ నారాయణ, సూపర్‌వైజర్‌ మల్లికార్జున, వింజమూరు సొసైటీ సీఈవో మేకల రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

------

Updated Date - 2023-11-21T21:28:57+05:30 IST