Nara Lokesh : నాటు పాట ఆస్కార్ గెలుచుకోవటం దేశానికే గర్వకారణం

ABN , First Publish Date - 2023-03-13T09:30:35+05:30 IST

అందరి అంచనాలు అందుకుని నాటు నాటు పాట ఆస్కార్ గెలుచుకోవటం దేశానికే గర్వకారణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు.

Nara Lokesh : నాటు పాట ఆస్కార్ గెలుచుకోవటం దేశానికే గర్వకారణం

అమరావతి : అందరి అంచనాలు అందుకుని నాటు నాటు పాట ఆస్కార్ గెలుచుకోవటం దేశానికే గర్వకారణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ఇదో చారిత్రాతక ఘట్టంగా అభివర్ణించారు. రాజమౌళి, కీరవాణి, ఎన్టీఆర్, రాంచరణ్, సింప్లీగంజ్, చంద్రబోస్, ప్రేమరక్షిత్, కాలభైరవ చిత్ర బృందం మొత్తానికి ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. ఉత్తమ షార్ట్ ఫిలిం విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ బృందానికి సైతం నారా లోకేష్ శుభాభినందనలు తెలియజేశారు.

తెలుగు పాట ‘నాటు నాటు’ ఆస్కార్ అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించింది. మొదటి సారిగా ఒక తెలుగు పాట ఇలా ఆస్కార్ గెలుచుకోవటం ఇదే మొదటిసారి. భారత దేశానికి చెందిన వారు ఎంతమంది ఆస్కార్ గెలుచుకున్నారు అంటే వేళ్ళ మీద లెక్కించవచ్చు. అలాంటిది ఒక తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’ లోని ఈ పాటకి ఆస్కార్ రావటం భారత దేశానికే గర్వ కారణం. దర్శకుడు భారతదేశం గర్వించదగ్గ దర్శకుడిగా రాజమౌళి మారిపోయారు. దక్షిణాది నుంచి ఆస్కార్ గెలుచుకున్న తొలి చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది.

Updated Date - 2023-03-13T09:30:35+05:30 IST