MP MVV Satyanarayana: ఎంవీవీ సత్యనారాయణ మంచి వ్యక్తి: రఘురామ

ABN , First Publish Date - 2023-06-16T16:11:38+05:30 IST

విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మంచి వ్యక్తి అని ఎంపీ రఘురామకృష్ణరాజు కొనియాడారు. విశాఖ ఎంపీ భార్యను, కుమారుడిని కిడ్నాప్ చేశారని, కిడ్నాప్ చేసిన వ్యక్తి ఎంపీకి ఫోన్ చేస్తారు కానీ.. జీవీకి ఎందుకు ఫోన్ చేశారు? అని ప్రశ్నించారు. కడప గ్యాంగ్, కర్నూల్ గ్యాంగ్ కావొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. హేమంత్కుమార్ అనే వ్యక్తికి కిడ్నాప్కి సంబంధం లేదని తోచిపుచ్చారు.

MP MVV Satyanarayana: ఎంవీవీ సత్యనారాయణ మంచి వ్యక్తి: రఘురామ

ఢిల్లీ: విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (MP MVV Satyanarayana) మంచి వ్యక్తి అని ఎంపీ రఘురామకృష్ణరాజు (Raghu Rama Krishna Raju) కొనియాడారు. విశాఖ ఎంపీ భార్యను, కుమారుడిని కిడ్నాప్ చేశారని, కిడ్నాప్ చేసిన వ్యక్తి ఎంపీకి ఫోన్ చేస్తారు కానీ.. జీవీకి ఎందుకు ఫోన్ చేశారు? అని ప్రశ్నించారు. కడప గ్యాంగ్, కర్నూల్ గ్యాంగ్ కావొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. హేమంత్కుమార్ అనే వ్యక్తికి కిడ్నాప్కి సంబంధం లేదని తోచిపుచ్చారు. ఎన్ఐఏ (NIA)తో పాటు ప్రధాని మోదీకి విశాఖ కిడ్నాప్ ఘటనపై లేఖ రాస్తాననని రఘురామ తెలిపారు.

విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడు శరత్‌ చౌదరి రుషికొండలో ఓ విలాసంతమైన విల్లా నిర్మించుకున్నారు. ఆరు నెలల క్రితం పెళ్లయ్యాక అక్కడే నివసిస్తున్నారు. సెల్‌ఫోన్‌ చోరీ నుంచి హత్య వరకు అనేక కేసులున్న రౌడీ షీటర్‌ కోలా వెంకట హేమంత్‌ కన్ను... ఈ ఇంటిపై పడింది. ‘సరిగ్గా ప్లాన్‌ చేస్తే కోట్లు కొల్లగొట్టవచ్చు’ అని అనుకున్నాడు. ఈనెల 13వ తేదీ... మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో హేమంత్‌, రాజేశ్‌ (ఇతనూ రౌడీ షీటరే), మరొకరు కలిసి శరత్‌ చౌదరి ఇంట్లోకి ప్రవేశించారు. భార్య పుట్టింటికి వెళ్లడంతో ఆ సమయంలో శరత్‌ ఒక్కరే ఇంట్లో ఉన్నారు. ఆయనను హేమంత్‌ గ్యాంగ్‌ ఆయనను బందీగా చేసుకుంది. శరత్‌ను కొట్టారు. ఇంట్లో ఉన్న నగదు, నగల కోసం ముగ్గురూ ఆరా తీశారు. రోజంతా ఈ తతంగం సాగింది. కానీ... ఆ ఇంట్లో వాళ్లు ఆశించిన స్థాయిలో నగదు, నగలూ దొరకలేదు.

దీంతో... ఎంపీ భార్య జ్యోతి వద్ద బంగారం దోచుకోవచ్చుననే ఉద్దేశంతో... ‘మీ అమ్మను ఇక్కడికి పిలిపించు’ అంటూ శరత్‌తోబుధవారం ఉదయం 7గంటల సమయంలో ఆమెకు ఫోన్‌ చేయించారు. ఆమెకు అనుమానం రాకుండా మాట్లాడాలని బెదిరించారు. అంతకు కొద్దిసేపటి ముందే ఎంపీ విశాఖ నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. ఈలోపే కుమారుడి నుంచి ఫోన్‌ రావడంతో... ఆమె లాసన్స్‌బే కాలనీలోని తన నివాసం నుంచి రుషికొండలోని కుమారుడి ఇంటికి చేరుకున్నారు. ఆ వెంటనే... హేమంత్‌ గ్యాంగ్‌ ఆమెను కూడా బందీగా పట్టుకుంది. ఆమె దగ్గర కూడా పెద్దగా విలువైన నగలు లేకపోవడంతో... ఎంపీకి వ్యాపార భాగస్వామి, మిత్రుడైన ప్రముఖ ఆడిటర్‌ గన్నమనేని వెంకటేశ్వరరావు (జీవీ)కు ఫోన్‌ చేయించారు. బుధవారం ఉదయం 11 గంటలకు జీవీ అక్కడికి వచ్చారు. హేమంత్‌ ముఠా ఆయనను కూడా బందీగా పట్టుకుంది. సినీ ఫక్కీలో చేజ్ చేసి కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు. ఎంవీవీ సత్యనారాయణ భార్య, కొడుకు, ఆడిటర్ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు.

Updated Date - 2023-06-16T16:12:41+05:30 IST