LokeshPadayatra: ఎంపీ మాధవ్ ఏదేదో విప్పి చూపిస్తున్నారు: లోకేష్

ABN , First Publish Date - 2023-03-26T18:00:55+05:30 IST

బీసీలకు సీఎం జగన్‌ (CM Jagan) అన్యాయం చేశారని టీడీపీ నేత నారా లోకేష్ (NaraLokesh) మండిపడ్డారు. వైసీపీకి ఓటేసిన పాపానికి బీసీలను తొక్కేస్తున్నారని తప్పుబట్టారు.

LokeshPadayatra: ఎంపీ మాధవ్ ఏదేదో విప్పి చూపిస్తున్నారు: లోకేష్

అనంతపురం: బీసీలకు సీఎం జగన్‌ (CM Jagan) అన్యాయం చేశారని టీడీపీ నేత నారా లోకేష్ (Nara Lokesh) మండిపడ్డారు. వైసీపీకి ఓటేసిన పాపానికి బీసీలను తొక్కేస్తున్నారని తప్పుబట్టారు. బీసీల తరపున పోరాడకుండా.. ఎంపీ మాధవ్ ఏదేదో విప్పి చూపిస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి రాగానే బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని ప్రకటించారు. బీసీ సబ్ ప్లాన్‌ (BC Sub Plan)ను ఏర్పాటు చేసింది టీడీపేనని గుర్తుచేశారు. వైసీపీ (YCP)కి వ్యతిరేకంగా మాట్లాడిన బీసీలకు ఈ ప్రభుత్వం క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని లోకేష్ దుయ్యబట్టారు.

వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది

రామయ్యపేటలో మహిళలతో లోకేశ్‌ ముఖాముఖి నిర్వహించారు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. దిశా చట్టం కేవలం యాప్‌కే పరిమితమైందని విమర్శించారు. వడ్డీలేని రుణాలు ఇస్తామన్న వైసీపీ ప్రభుత్వం మాటతప్పిందన్నారు. అధికారంలోకి వచ్చాక మహిళ రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మహిళలపై దాడులుచేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని లోకేశ్‌ హెచ్చరించారు.

దోచుకోవడంలో వైసీపీ ప్రభుత్వం ఎవరినీ వదలడంలేదు: లోకేశ్‌

ఆలపల్లిలో లోకేశ్‌ను ఆటో యూనియన్‌ నేతలు కలిశారు. ‘‘దోచుకోవడంలో వైసీపీ ప్రభుత్వం ఎవరినీ వదలడంలేదు. ఈ-చలాన్ విధానాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. టార్గెట్లతో చలానాలు వసూలు చేయాలని పోలీసులను వేధిస్తున్నారు. అడ్డగోలు చలానా విధానానికి టీడీపీ వచ్చాక స్వస్తి పలుకుతాం. ఆటో యూనియన్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమాన్ని అందిస్తాం. మా ప్రభుత్వం రాగానే గ్రీన్‌ట్యాక్స్ తగ్గిస్తాం’’ నారా లోకేశ్‌ ప్రకటించారు.

Updated Date - 2023-03-26T18:00:55+05:30 IST