Local body MLC elections: స్ట్రాంగ్ రూమ్‌కు చేరుకున్న బ్యాలెట్ బాక్సులు

ABN , First Publish Date - 2023-03-13T23:37:29+05:30 IST

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల(Local body MLC elections) పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు ఏలూరు(Eluru) ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్‌కు చేరుకున్నాయి.

Local body MLC elections: స్ట్రాంగ్ రూమ్‌కు చేరుకున్న బ్యాలెట్ బాక్సులు
Local body MLC elections

ఏలూరు: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల(Local body MLC elections) పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు ఏలూరు(Eluru) ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్‌కు చేరుకున్నాయి. ఏలూరు(Eluru), జంగారెడ్డిగూడెం(Jangareddygudem), భీమవరం(Bhimavaram), నర్సాపురం(Narsapuram), కొవ్వూరు(Kovvur) పోలింగ్ కేంద్రాల నుంచి పోలింగ్ అనంతరం పోలింగ్ సిబ్బంది ఎన్నికల సంఘం నిర్దేశించిన రీతిలో బ్యాలెట్ బాక్సులకు సీళ్లు వేసి, వాటిని, ఇతర రికార్డులను తీసుకుని ఏలూరు ఎంపిడిఓ కార్యాలయంలో స్ట్రాంగ్ రూమ్ వద్ద గల సిబ్బందికి అందజేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా పరిశీలకులు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్, జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి వె. ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ మరియు రిటర్నింగ్ అధికారి పి . అరుణ్ బాబు లు ఏలూరులోని స్ట్రాంగ్ రూమ్ వద్ద బ్యాలెట్ బాక్స్ లకు వేసిన సీళ్లు, ఇతర రికార్డులను పరిశీలించి స్ట్రాంగ్ రూమ్‌లో ఉంచేందుకు అనుమతించారు. బ్యాలెట్ బాక్సులన్నింటినీ స్ట్రాంగ్ రూమ్‌లో ఉంచిన అనంతరం రిటర్నింగ్ అధికారి పి. అరుణ్ బాబు స్ట్రాంగ్ రూమ్‌కి స్వయంగా సీలు వేశారు.

Updated Date - 2023-03-13T23:37:32+05:30 IST