ఓటమి భయంతోనే వైసీపీ కుట్రలు: టీడీపీ

ABN , First Publish Date - 2023-09-21T23:48:51+05:30 IST

ఓటమి భయంతోనే వైసీపీ కుట్రలు పన్నుతోందని టీడీపీ డోన్‌ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ఆరోపించారు.

ఓటమి భయంతోనే వైసీపీ కుట్రలు: టీడీపీ
డోన్‌లోని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటరును పరిశీలిస్తున్న సుబ్బారెడ్డి, టీడీపీ నాయకులు

డోన్‌, సెప్టెంబరు 21: ఓటమి భయంతోనే వైసీపీ కుట్రలు పన్నుతోందని టీడీపీ డోన్‌ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ఆరోపించారు. పట్టణంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద గురువారం టీడీపీ ఆధ్వర్యంలో బాబుతో నేను నిరాహార దీక్ష చేపట్టారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైసీపీ అరాచక విధానాలతో రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందన్నారు. సీపీఎస్‌ను వారంలో రద్దు చేస్తానని హామీ ఇచ్చిన జగన్‌ మాట మార్చి మోసం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వ మోసాలు, అవినీతిపై చంద్రబాబు పోరాటం చేస్తూ వస్తున్నారన్నారు. ప్రజల్లో చంద్రబాబుకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ ప్రభుత్వం కుట్రలు పన్ని అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మురళీకృష్ణగౌడు, పార్టీ పట్టణ అధ్యక్షుడు సీఎం శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ ఆర్‌ఈ రాఘవేంద్ర, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి గంధం శ్రీనివాసులు, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్‌, బీసీ సెల్‌ జిల్లా అద్యక్షుడు ప్రజావైద్యశాల మల్లికార్జున, మిద్దెపల్లి గోవిందు, ఎల్‌ఐసీ శ్రీరాములు, అజీజ్‌, చక్రపాణిగౌడు, గురుస్వామి యాదవ్‌, ఖాజా, చిన్న కాంతు, నాగేంద్ర, కేబుల్‌ కిరణ్‌, ధను, ఎర్రిస్వామి పాల్గొన్నారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ పరిశీలన

పట్టణంలో టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను టీడీపీ డోన్‌ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మురళీకృష్ణగౌడు, ఆర్‌ఈ రాఘవేంద్ర, శ్రీనివాసులు యాదవ్‌, గండికోట రామసుబ్బయ్య తదితరులు గురువారం పరిశీలించారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ టీడీపీ హయాంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను స్థాపించి నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. కేవలం రాజకీయ కక్షతోనే చంద్రబాబును అక్రమంగా అరెస్టులు చేశారని సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

బేతంచెర్ల: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుతూ మండలంలోని ఆర్‌ఎస్‌ రంగాపురంలో వెలసిన మద్దిలేటి స్వామి క్షేత్రంలో స్వామికి టీడీపీ మండల కన్వీనర్‌ ఎల్లనాగయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు పోలూరు వెంకటేశ్వరరెడ్డి, సీనియర్‌ నాయకురాలు బుగ్గన ప్రసన్నలక్ష్మి తిరుమలేశ్‌ చౌదరి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నాయకులు, కార్యకర్తలు 101 టెంకాయలు కొట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వలి, అంబాపురం సర్పంచ్‌ శ్రీనివాస్‌ యాదవ్‌, రవీంద్ర నాయక్‌, కేవీ సుబ్బారెడ్డి, టైలర్‌ రాముడు, గుడిసె మద్దిలేటి, నల్లారెడ్డి, లొడ్డ శేఖర్‌, రామమద్దయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.

బనగానపల్లె: చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం బనగానపల్లె పట్టణంలో నిరసన దీక్ష చేపట్టారు. టీడీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరమణనాయక్‌, నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు హెచ్‌. కృష్ణానాయక్‌, శ్రీరాములునాయక్‌, రాముడునాయర్‌, జి.కృష్ణనాయక్‌, సురేశ్‌ నాయక్‌, గోవింద్‌నాయక్‌, వెంకటరాముడునాయక్‌, అరుణ్‌కుమార్‌ నాయక్‌, చిన్నరాజుపాలెంతండా, రాళ్లకొత్తూరు తండాకు బంజారా మహిళలు గురువా రం నిరసన దీక్ష చేపట్టారు. దీక్షలకు బీసీ జనార్దన్‌రెడ్డి, బీసీ ఇందిరమ్మ, టంగుటూరు శ్రీనయ్య, పట్టణ ఉపసర్పంచ్‌ బురానుద్దీన్‌, సలాం, అల్తాఫ్‌ హుస్సేన్‌, ఖాదర్‌ తదితరులు సంఘీభావం ప్రకటించారు.

శిరివెళ్ల: సైకో సీఎం జగన్‌ కుతంత్రాలను తిప్పికొడతామని మాజీ ఎంపీపీ, టీడీపీ మండల కన్వీనర్‌ కాటంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. చంద్రబా బు అక్రమ అరెస్టుకు నిరసనగా నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్‌ హాల్‌ వద్ద మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, యువ నాయకుడు భూమా జగత్‌ విఖ్యాత్‌రెడ్డి చేపట్టిన నిరాహార దీక్షలో ఆయన గురువారం పాల్గొన్నారు. జగన్‌ ప్రజలను అన్ని విధాలా వంచించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మురళి, మాజీ జడ్పీటీసీ యామా గుర్రప్ప, నాయకులు సూరా రామ, భూమా వెంకట వేణుగోపాల్‌రెడ్డి, గంగదాసరి శ్రీనివాసరెడ్డి, గంగదాసరి లక్ష్మిరెడ్డి, కమతం లక్ష్మీరెడ్డి, బీఎండీ రఫి, అబూబకర్‌ సిద్ధిఖ్‌, బీసీ ఫిదా హుసేన్‌, కృష్ణమూర్తి తదితరులతో పాటు జనసేన మండల కన్వీనర్‌ పసుల నరేంద్ర యాదవ్‌, జన సైనికులు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు.

Updated Date - 2023-09-21T23:48:51+05:30 IST