‘వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత’
ABN , First Publish Date - 2023-10-04T00:06:33+05:30 IST
అడవులు, వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని సెక్షన్ ఆఫీసరు శ్రీనివాసరెడ్డి అన్నారు.
రుద్రవరం, అక్టోబరు 3: అడవులు, వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని సెక్షన్ ఆఫీసరు శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం వన్యప్రాణుల వారోత్సవంలో భాగంగా హరినగరం చెంచుగూడెంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. సెక్షన్ ఆఫీసరు మాట్లాడుతూ వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సెక్షన్ ఆఫీసరు రాణెమ్మ, హెచ్‌ఎం రమేష్, బీట్ ఆఫీసర్లు నరసింహారెడ్డి, సురేంద్రగౌడ్, రామకృష్ణ పాల్గొన్నారు.
శిరివెళ్ల: వన్యప్రాణులను సంరక్షించడం అందరి బాధ్యతని చలమ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ ఈశ్వరయ్య అన్నారు. వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా మండంలోని మహదేవపురం మజారా గ్రామమైన పచ్చర్లలో అటవీశాఖ అధికారులు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. సర్పంచ్ పెద్ది రమణయ్య, ఉప సర్పంచ్ మద్దిలేటమ్మ, ఆళ్లగడ్డ మార్కెట్‌యార్డు వైస్ చైర్మన్ పిక్కిలి నరహరి, పచ్చర్ల సెక్షన్ అధికారి రాజు, బీట్ అధికారులు రామారావు, అర్షద్, మద్దిలేటి స్వామి పాల్గొన్నారు.
చాగలమర్రి: వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యతని అటవీశాఖ ఎఫ్‌వో పెద్దన్న తెలిపారు. మంగళవారం మండలంలోని నగల్లపాడు గ్రామంలోగల ప్రాథమిక పాఠశాలలో వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవాలు నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ర్యాలీ చేశారు. ఎఫ్‌వో మాట్లాడుతూ అడవులు మానవ మనుగడకు ఎంతో అవసరం అన్నారు. అటవీ జంతువులను హాని కలిగించరాదని, జంతువులను చంపితే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం లలితకుమారి, ఎఫ్‌బీవో నాగేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.