వెన్నంటే మేమున్నాం.. నియంతను తరుముతాం

ABN , First Publish Date - 2023-09-25T00:29:50+05:30 IST

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు చేపట్టిన నిరాహార దీక్షలు ఆదివారం 12వ రోజుకు చేరాయి. నంద్యాల, నందికొట్కూరు నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలకు మద్దతుగా మేముసైతం చంద్రన్నకు తోడుగా ఉంటామంటూ వడ్డెర సంఘం నాయకులు సంఘీభావ దీక్ష చేపట్టారు.

వెన్నంటే మేమున్నాం..  నియంతను తరుముతాం
పాణ్యం నిరాహార దీక్షా శిబిరంలో చంద్రబాబును విడుదల చేయాలని కోరుతూ ముస్లిం నాయకులతో కలిసి ప్ర్థానలు చేస్తున్న గౌరు చరిత

12వ రోజూ కొనసాగిన నిరాహార దీక్షలు

చంద్రన్నకు తోడుగా మేము సైతం అంటూ

వడ్డెర, ముస్లిం నాయకుల సంఘీభావ దీక్షలు

పాణ్యంలో మైనార్టీలతో కలిసి గౌరు చరిత ప్రార్థనలు

పాములపాడులో కొవ్వొత్తుల ప్రదర్శన

అరెస్టుకు నిరసనగా సంతకాల సేకరణ

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు చేపట్టిన నిరాహార దీక్షలు ఆదివారం 12వ రోజుకు చేరాయి. నంద్యాల, నందికొట్కూరు నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలకు మద్దతుగా మేముసైతం చంద్రన్నకు తోడుగా ఉంటామంటూ వడ్డెర సంఘం నాయకులు సంఘీభావ దీక్ష చేపట్టారు. పాణ్యంలో ముస్లిం నాయకులు దీక్షలు చేపట్టి చంద్రబాబు విడుదల కావాలని కాంక్షిస్తూ మాజీ ఎమ్మెల్యే గౌరు చరితతో కలిసి ప్రార్థనలు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు జరిగాయి.

రాజకీయ కక్షతోనే అరెస్టు : ఎన్‌ఎండీ ఫరూక్‌

నంద్యాల (నూనెపల్లె), సెప్టెంబరు 24 : రాష్ట్రంలో చంద్రబాబుకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక రాజకీయ కక్షతోనే అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. ఆదివారం బాబు కోసం మేము సైతం కార్యక్రమంలో భాగంగా టీడీపీ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 12వ రోజుకు చేరాయి. ఆదివారం వడ్డెర సామాజిక వర్గీయులు దీక్షలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఫరూక్‌ దీక్షను ప్రారంభించి మాట్లాడారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో 2లక్షల మంది నిరుద్యోగులు ఉపాధి పొందారని, ఇందులో అవినీతి ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. దీక్షా శిబిరం వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసన తెలుపుతూ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున సంతకాలు చేశారు.

నియంతపై పోరాటం ఆగదు : గౌరు చరిత

నంద్యాల (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రాన్ని నియంతృత్వంతో పాలిస్తున్న జగన్‌పై పోరాటం ఆగదని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గౌరుచరిత అన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ నేతలు చేపడుతున్న నేను సైతం దీక్ష ఆదివారం 12వ రోజుకు చేరాయి. నియోజకవర్గ ముస్లిం నాయకులు, కార్యకర్తలు దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియంతకు బుద్ధి చెప్పడానికి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్బంగా ముస్లిం నాయకులు చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుతూ శిబిరంలోనే ముస్లిం నాయకులతో కలిసి గౌరుచరిత ప్రార్థనలు చేశారు. అనంతరం సంతకాల సేకరణలో పాల్గొన్నారు. ఎంపీటీసీ రంగరమేష్‌, రాష్ట్ర మైనార్టీ సెల్‌ కార్యదర్శి ఫరూక్‌, నియోజకవర్గ అధ్యక్షుడు ఫిరోజ్‌, ప్రధాన కార్యదర్శి మహబూబ్‌ బాషా, జిల్లా మైనార్టీ కార్యదర్శి ఖాదర్‌బాషా, శాలుబాషా, ఖాజామియా, హుశేన్‌, జాకీర్‌హుశేన్‌, మదార్‌సా, ఇవ్రహీం, ఇర్ఫాన్‌, మండల కన్వీనర్‌ జయరామిరెడ్డి, రామమోహన్‌నాయుడు, రమణమూర్తి, నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పుట్టగతులుండవ్‌

ఆత్మకూరు: సీఎం జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న రాజకీయ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీకి పుట్టగతులుండవని నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త బన్నూరు రామలింగారెడ్డి, ఆత్మకూరు మేజర్‌ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్‌ కంచర్ల గోవిందరెడ్డి అన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట టీడీపీ శ్రేణులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 12వ రోజు ఆదివారం కొనసాగాయి. టీడీపీ సమన్వయకర్త బన్నూరు రామలింగారెడ్డి ఉదయం దీక్షలను ప్రారంభించగా, మాజీ సర్పంచ్‌ కంచర్ల గోవిందరెడ్డి సాయంత్రం దీక్షల్లో కుర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు శివప్రసాద్‌రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్లాపురం బాషా, టీడీపీ లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి శాకమూరి గిరిరాజు, టీడీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు కలిముల్లా, నాయకులు రవీంద్రబాబు, రామ్మూర్తి, గోకారి, అలిహుసేన్‌, ఫకృద్దిన్‌, ఆర్టీసీ రామకృష్ణ, సతీష్‌, సూర్యనారాయణరెడ్డి, శ్రీరామ్‌రెడ్డి, కృష్ణ, రమేష్‌, గోవర్థన్‌, అస్లాంబాషా, జనార్దన్‌రెడ్డి, బాబు, నాగస్వామి, బుడ్డన్న తదితరులు ఉన్నారు.

వడ్డెర సంఘం నాయకుల సంఘీభావ దీక్ష

నందికొట్కూరు: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ నందికొట్కూరు పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం సర్కిల్‌ వద్ద చేపట్టిన సామూహిక నిరాహార దీక్షలు 12వ రోజుకు చేరాయి. టీడీపీ చేపట్టిన సామూహిక నిరాహార దీక్షలకు మద్దతుగా నియోజకవర్గ వడ్డెర సంఘం నాయకులు సంఘీభావ దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో వడ్డెర సంఘం కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌, నియోజకవర్గ పరిశీలకుడు దేవళ్ల మురళి, మాండ్ర సురేంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర ఎస్సీసెల్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ జయసూర్య, జూపాడుబంగ్లా, మిడ్తూరు మండల కన్వీనర్‌లు వెంకటేశ్వర్లు యాదవ్‌, ఖాతా రమేష్‌రెడ్డి, పట్టణ కన్వీనర్‌ భాస్కర్‌రెడ్డి, మాజీ జిల్లా పీపీ నాగముని, జమీల్‌, రసూల్‌, మరియు నియోజకవర్గ వడ్డెర సంఘం నాయకులు రవీంద్రబాబు, శ్రీను, శంకర్‌, ఎల్లా పుల్లయ్య, వెంకటయ్య, జమ్ములయ్య, ఈరన్న, మద్దిలేటి, ఉదయ్‌, సురేష్‌, వెంకటశివుడు, లక్ష్మన్న, పట్టణ నాయకులు ఐ టీడీపీ ముర్తుజావళి, మోహన్‌, నిమ్మకాయల రాజు, రాజన్న, రగడ, వహీద్‌ కళాకారు, వహీద్‌, రామ్మోహన్‌రెడ్డి, నాగేంద్ర, నంద్యాల పార్లమెంటరీ తెలుగుయువత ఉపాధ్యక్షులు మద్దిలేటి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-25T00:29:50+05:30 IST