ప్రశాంతంగా వినాయక నిమజ్జనం

ABN , First Publish Date - 2023-09-22T00:01:32+05:30 IST

బేతంచెర్లలో గురువారం వినాయక నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు.

ప్రశాంతంగా వినాయక నిమజ్జనం
కోలాటం ఆడుతున్న మహిళలు

బేతంచెర్ల, సెప్టెంబరు 21: బేతంచెర్లలో గురువారం వినాయక నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. గణేశ్ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో కోలాటాలు, వివిద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఘనంగా నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డోన్‌ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సీఐలు ప్రియతమ్‌ రెడ్డి, రామాంజినేయ నాయక్‌ ఐదుగురు ఎస్‌ఐలు, 120 మంది పోలీసులు భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. కమిటీ సభ్యులు హుశేన్‌ రెడ్డి, మారుతి కృష్ణ, చంద్రమౌలి, ఈశ్వర్‌ రెడ్డి, మధుమోహన్‌ రెడ్డి, నాగ మోహన్‌, మురళీకృష్ణ, శ్రీనివాసులు, నాగేశ్వర్‌ రెడ్డి భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T00:01:32+05:30 IST