ప్రజా సమస్యల పరిష్కార వేదికే పల్లె నిద్ర: టీడీపీ

ABN , First Publish Date - 2023-06-26T00:49:50+05:30 IST

ప్రజా సమస్యల పరిష్కార వేదికగా పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదికే పల్లె నిద్ర: టీడీపీ
ఫరూక్‌, బ్రహ్మానందరెడ్డికి స్వాగతం పలుకుతున్న గ్రామస్థులు

నంద్యాల, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదికగా పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపుమేరకు భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా నంద్యాల మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఆదివారం వారు పల్లెనిద్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. నంద్యాల నుంచి బైక్‌ ర్యాలీగా కొత్తపల్లి గ్రామానికి తరలివెళ్లారు. స్థానిక టీడీపీ నాయకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో టీడీపీ హయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏవిధంగా జరిగాయి, భవిష్యత్‌లో టీడీపీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భవిష్యత్‌కు గ్యారెంటీ దోహదపడుతోందని అన్నారు. నాలుగేళ్ల వైసీపీ పాలనతో ప్రజలకు ఒరిగిందేమి లేదని విమర్శించారు. అధిక ధరలు, వివిధ రకాల పన్నుల భారంతో ప్రజలు విసిగిపోయారన్నారు. అంతకుముందు గ్రామంలో కేక్‌కట్‌ చేసి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ అధికారంలోకి వస్తే ప్రవేశపెట్టబోయే పథకాల గురించి ప్రజలకు వివరించారు. టీడీపీ నాయకులు గురునాథరెడ్డి, లక్ష్మీరెడ్డి, కోటిలింగారెడ్డి, లక్ష్మయ్య, టీడీపీ లీగల్‌ సెల్‌ న్యాయవాదులు మనోహర్‌రెడ్డి, రామ్మోహన్‌ రెడ్డి, గ్రామ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Updated Date - 2023-06-26T00:49:50+05:30 IST