Share News

భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి

ABN , Publish Date - Dec 24 , 2023 | 12:14 AM

నగరంలోని సంకల్‌బాగ్‌లో గల హరిహర క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను శనివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి
గోదా గోకులంలో కొలువుదీరిన శ్రీరంగనాథ స్వామి

కర్నూలు(కల్చరల్‌), డిసెంబరు 23: నగరంలోని సంకల్‌బాగ్‌లో గల హరిహర క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను శనివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శన అవకాశం కల్పించారు. వేకువ జామునే వేంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మ వార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, ఉదయం 5.30 గంటల నుంచి భక్తులకు దర్శనాలు కల్పించారు. నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కళ్లే చంద్రశేఖర్‌ శర్మ, కార్యదర్శి హెచ్‌కే రాజశేఖర్‌రావు, హెచ్‌కే మనోహర్‌రావు తదితరుల ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు. నగరంలోని గోదాగోకులంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను శనివారం వైభవంగా నిర్వహించారు. వేకువ జామునే రంగనాథస్వామి వారికి, గోదా దేవి అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శన అవకాశం కల్పించారు. ఈ వేడుకలకు త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్‌ స్వామీజీ హాజరై భక్తులకు వైకుంఠ ఏకాదశి పర్వదిన విశిష్టతను తెలియజేశారు. గోదా విష్ణు నిత్య సేవాధామ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మారం నాగరాజ గుప్త, మేనేజింగ్‌ ట్రస్టీ పల్లెర్ల నాగరాజుల ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. వెంకటరమణ కాలనీలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి వారి ఆలయం, కృష్ణానగర్‌లోని శ్రీనివాస మందిరంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనం కల్పిం చారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి, శ్రీనివాసరెడ్డిల ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. పాతనగరంలోని మాలే బాలయ్య సత్రంలో, రామాలయంలో, రాంబొట్ల ఆలయంలో, బీక్యాంపులోని విజ్ఞాన మందిరంలో, పార్కురోడ్డులోని ఇస్కాన్‌ మందిరంలో, మారుతీనగర్‌లోని లక్ష్మీ నరసింహ సీతారామాలయంలో వైకుంఠ ఏకాదశి పూజలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

కోడుమూరు(రూరల్‌): మండలంలోని గోరంట్ల, వర్కూరు గ్రామాల్లోని లక్ష్మీమాధవస్వామి ఆలయాల్లో శనివారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా పూజలు నిర్వహించారు. భక్తులు అభిషేకాలు, అర్చనలు, కుం కుమపూజ నిర్వహించారు. భక్తులకు ఉత్తరద్వారం గుండా దర్శనం కల్పించారు. వర్కూ రులో లక్ష్మీమాధవస్వామివార్ల కల్యాణం జరిపించారు. గోరంట్లలో సాయం త్రం ఉత్సవమూర్తులను దాతలు అందించిన రథంపై ఉంచి ఊరేగించారు.

కోట్ల పూజలు: గోరంట్ల లక్ష్మీమాధవస్వామి ఆలయంలో వైకుంఠ ఏకా దశి సందర్భంగా టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్‌ అరవ నారాయణ, టీఎన్‌టీయూసీ నియో జకవర్గ ఉపాధ్యక్షుడు తిరుమల నాయుడు ఆధ్వర్యంలో పూజారులు పూర్ణ కుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజ లు నిర్వహించిన కోట్ల మొక్కులు తీర్చుకున్నారు. కుడా చైర్మన్‌ కోట్ల హర్షవ ర్దన్‌రెడ్డి సతీసమేతంగా పూజలు నిర్వహించారు. ఇంకా కోట్ల హరిచక్ర పాణిరెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌, మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ, టీడీపీ మండల కన్వీనర్‌ కోట్ల కవితమ్మ దర్శించుకున్నారు.

ఓర్వకల్లు: మండలంలోని ఓర్వకల్లు, కాల్వ, కన్నమడకల, కేతవరం, పూడిచెర్ల, నన్నూరు, లొద్దిపల్లె, ఉయ్యాలవాడ, హుశేనాపురం, కొమరోలు, సోమయాజులపల్లె, శకునాల గ్రామాల్లో శనివారం వైకుంఠ ఏకాదశి ఘనంగా నిర్వహించారు. ఆయా ఆలయాల్లో ఉత్తర ద్వారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. కాల్వ గ్రామంలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో అర్చకులు కె.చంద్రుడు, లక్ష్మీనారాయణ శర్మ స్వామివారికి పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారికి కాయకర్పూరాలు సమర్పించి మొక్కు లు తీర్చుకున్నారు.

Updated Date - Dec 24 , 2023 | 12:14 AM