‘ఫ్యామిలీ ఫిజీషియన్‌ను వినియోగించుకోండి’
ABN , First Publish Date - 2023-02-21T00:46:24+05:30 IST
ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలను వినియోగించుకో వాలని డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య సూచించారు.
కర్నూలు(హాస్పిటల్), ఫిబ్రవరి 20: ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలను వినియోగించుకో వాలని డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య సూచించారు. సోమవారం స్థానిక స్టాంటన్‌పురం యుపీహెచ్‌సీని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అనీమియా మానిటరింగ్ టూల్, ఆర్‌సీహెచ్ పోర్టల్, ఎన్‌సీడీ సర్వేలకు సంబంధించిన ప్రగతిని సమీక్షించారు. ప్రమా దకర గర్భిణులను గుర్తించి వారిని కాన్పు తేదీకి మూడు రోజుల ముందుగానే ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాలని ఆదేశించారు. అనంతరం బొమిరెడ్డిపల్లెలో జరుగుతున్న ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. ఆరోగ్య సిబ్బందికి కేటాయించిన గ్రామా న్ని సందర్శించి ఉదయం హెల్త్ క్యాంపు, ఆరోగ్య పరీక్షలు చేసి చికిత్సలు అందించాలని, అం గన్‌వాడీ కేంద్రం, స్కూల్‌ను సందర్శించాలన్నారు. ఆయన వెంట ఉలిందకొండ పీహెచ్‌సీ వైద్యాధికారి డా.భాస్కర్ రెడ్డి, స్టాంటన్‌పురం పీహెచ్‌సీ డా.రేవతి, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.