కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిని బర్తరఫ్‌ చేయాలి

ABN , First Publish Date - 2023-10-04T00:43:58+05:30 IST

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని రైతు, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిని బర్తరఫ్‌ చేయాలి

రైతు, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌

కర్నూలు(న్యూసిటీ), అక్టోబరు 3: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని రైతు, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం కేంద్ర కార్మిక, రైతు సంఘాల ఇచ్చిన పిలుపు మేరకు బ్లాక్‌ డే కార్యక్రమాన్ని కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించారు. ఈసందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో రైతులపై కాల్పు లు జరిపి వారి ప్రాణాలను బలి తీసుకున్న ఘటనకు బాధ్యుడైన మంత్రిని ఎందుకు బర్తరఫ్‌ చేయడం లేదని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానా లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బ్లాక్‌ డే నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జి.రామక్రిష్ణ, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్‌.రాధాక్రిష్ణ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్‌. మునెప్ప, ఎస్‌యూసీఐ జిల్లా నాయకుడు నాగన్న, కౌలు రైతుల సంఘం జిల్లా నాయకుడు తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-04T00:43:58+05:30 IST