స్వధార్‌ నుంచి ఇద్దరు యువతులు అదృశ్యం

ABN , First Publish Date - 2023-07-12T00:36:36+05:30 IST

ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మహిళా ప్రాంగణం స్వధార్‌ నుంచి ఇద్దరు యువతులు అదృశ్యమయ్యారు.

స్వధార్‌ నుంచి ఇద్దరు యువతులు అదృశ్యం

కర్నూలు, జూలై 11: ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మహిళా ప్రాంగణం స్వధార్‌ నుంచి ఇద్దరు యువతులు అదృశ్యమయ్యారు. సయ్యద్‌ ఫాతిమా, పార్వతీ బాయిలు అదృశ్యమైనట్లు స్వధార్‌ హోం జిల్లా మేనేజర్‌ అంజన పోలీ సులకు ఫిర్యాదు చేశారు. ఫాతిమా గత 19 ఏళ్లుగా ఈ అనాథ ఆశ్రమంలోనే పెరుగుతుంది. పార్వతీబాయి మంత్రాలయం మండలం మా ధవరం తండా గ్రామం. వీరిద్దరు సోమవా రం రాత్రి 9 గంటల ప్రాంతంలో ప్రాంగణం లోని బాత్‌ రూమ్‌ గోడను దూకి పరారయ్యారు. రాత్రి వాచ్‌మెన్‌ గుర్తించి మేనేజర్‌కు సమాచా రం ఇచ్చారు. చుట్టుపక్కల అంతా గాలించిన ఎక్కడా కనిపించకపోవడంతో మేనేజర్‌ పోలీసు లకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మురళీధర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-07-12T00:37:22+05:30 IST