ఇద్దరు మహిళలు అదృశ్యం

ABN , First Publish Date - 2023-10-04T00:45:16+05:30 IST

వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇద్దరు మహిళలు అదృశ్యమైనట్లు కేసు నమోదైంది.

ఇద్దరు మహిళలు అదృశ్యం

కర్నూలు, అక్టోబరు 3: వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇద్దరు మహిళలు అదృశ్యమైనట్లు కేసు నమోదైంది. ఖడక్‌పురకు చెందిన ఖాజాబీ(33) అనే మహిళ గత నెల 25 నుంచి ఇంటి నుంచి వెళ్లిపోయింది. బంధువులు పలు చోట్ల గాలించినా ఫలితం లేకపోవడంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే కుమ్మరివీధికి చెందిన శైలూషా అనే మహిళ మంగళవారం మధ్యాహ్నం తమ ఇంటి నుంచి వెళ్లిపోయింది. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో బంధు వులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2023-10-04T00:45:16+05:30 IST