ముగ్గురు సీఐలు బదిలీ
ABN , First Publish Date - 2023-06-07T23:03:51+05:30 IST
కర్నూలు జిల్లాలో ముగ్గురు సీఐలకు స్థానచలనం కల్పిస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత ఉత్తర్వులు జారీ చేశారు.
కర్నూలు, జూన 7: కర్నూలు జిల్లాలో ముగ్గురు సీఐలకు స్థానచలనం కల్పిస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత ఉత్తర్వులు జారీ చేశారు. ఒకటో పట్టణ సీఐగా ఉన్న తిమ్మారెడ్డిని బనగానపల్లెకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో కడప ట్రాఫిక్‌లో ఉన్న వెంకటేష్‌ను నియమించారు. అలాగే తాలుకా సీఐ రామలింగమయ్యను వీఆర్‌కు పంపారు. ఆయన స్థానంలో వీఆర్‌లో ఉన్న శ్రీరాములును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ శ్రీరాములు కొద్ది రోజుల కిందట ఆదోనిలో పని చేశారు. పేకాట స్థావరంపై దాడులు చేసి భారీ ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రజాప్రతినిధికి చెందిన ముఖ్యమైన బంధువు పట్టుబడటంతో ఆయనను వదిలి పెట్టాలని తీవ్ర ఒత్తిళ్లు తెచ్చారు. సీఐ శ్రీరాములు ససేమిరా అనడంతో ఆయనపై బదిలీ వేటు చేశారు. ప్రస్తుతం కర్నూలు తాలుకా సీఐగా నియమించారు.