Road Accident: పండగపూట విషాదం..బైక్‌ను ఢీకొట్టిన ఐచర్ వాహనం..
ABN , First Publish Date - 2023-01-15T08:11:47+05:30 IST
డోన్‌లో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై దొరపల్లి బ్రిడ్జి ఘోర రోడ్డు
నంద్యాల: డోన్‌లో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై దొరపల్లి బ్రిడ్జి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలను ఐచర్ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సెకండ్ షో సినిమాకు వెళ్లి తిరిగి వెళుతుండగా జాతీయ రహదారి దాటే క్రమంలో ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు దొరపల్లికి చెందిన ఎల్ల కృష్ణ, రామకృష్ణ, నందీశ్గా పోలీసులు గుర్తించారు.