టమో‘ఠా’

ABN , First Publish Date - 2023-09-18T00:33:49+05:30 IST

టమో‘ఠా’

టమో‘ఠా’

ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. సరిగ్గా నెలరోజుల క్రితం రూ.200 పలికిన టమోటా ధర ప్రస్తుతం భారీగా పతనమైంది. ఆదివారం పత్తికొండ మార్కెట్‌లో కిలో టమోటా రూ.2 పలికింది. ఇటీవలి కాలంలో టమోటాకు డిమాండ్‌ పెరగడంతో మొక్కతోసహా పెట్టుబడులు రెండింతలు పెరిగినా డిమాండ్‌ తమను గట్టెక్కిస్తుందని అప్పులు చేసి రైతులు పంటసాగు చేపట్టారు. ఈ క్రమంలో ధర ఘోరంగా పతనం కావడంతో కూలి ఖర్చులు, రవాణాచార్జీలు కూడా దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. - పత్తికొండ

Updated Date - 2023-09-18T00:34:00+05:30 IST