బైక్‌పై నుంచి పడి యువకుడి మృతి

ABN , First Publish Date - 2023-07-21T00:30:42+05:30 IST

ప్రమాద వశాత్తు బైక్‌పై నుంచి పడి ఓ యువకుడు మృతి చెందాడు.

బైక్‌పై నుంచి పడి యువకుడి మృతి

పెద్దకడబూరు, జూలై 20: ప్రమాద వశాత్తు బైక్‌పై నుంచి పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని దోడ్డిమేకల గ్రామ సమీపంలో గురువారం చోటు చేసుకుంది. కంబ దహల్‌ గ్రామానికి చెందిన నల్లన్న కూమారుడు శ్రీనివాసులు(23) దొడ్డిమేకల గ్రామానికి పెళ్లి కూమారుడును చూసేందుకు వచ్చారు. కార్యక్రమం ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యాడు. దొడ్డిమేకల సమీపంలోని మలుపు వద్ద బైక్‌ అదుపు తప్పి కాలువలో పడ్డాడు. బైక్‌ యువకుడిపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

Updated Date - 2023-07-21T00:30:42+05:30 IST