వాహనం బోల్తా..యువకుడు మృతి

ABN , First Publish Date - 2023-02-21T23:52:04+05:30 IST

మండలంలోని ప్యాలకుర్తి స్టేజీ సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో పరమేష్‌ (19) మృతి చెందాడు.

 వాహనం బోల్తా..యువకుడు మృతి

కోడుమూరు (రూరల్‌), ఫిబ్రవరి 21: మండలంలోని ప్యాలకుర్తి స్టేజీ సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో పరమేష్‌ (19) మృతి చెందాడు. కోడుమూరుకు చెందిన హమాలీ వర్కర్స్‌ యూనియన అధ్యక్షుడు బజారి పెద్ద కుమారుడు పరమేష్‌ కర్నూలు మార్కెట్‌లో వాము పంట విక్రయించడానికి బొలెరో వాహనంలో బయలుదేరాడు. అయితే ప్యాలకుర్తి స్టేజీ సమీపంలో బొలేరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో సంచులపై కూర్చున్న పరమేష్‌ కిందపడడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్‌కు స్వల్పగాయాలు అయ్యాయి. సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, కార్యవర్గ సభ్యులు క్రిష్ణ, మండల, పట్టణ కార్యదర్శులు రాజు, రాముడు, ఆలయ చైర్మన ఎద్దుల మహేశ్వరరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

Updated Date - 2023-02-21T23:52:05+05:30 IST