రాష్ట్రాన్ని కాపాడుకోవాలి : జనసేన

ABN , First Publish Date - 2023-09-18T00:40:30+05:30 IST

రాక్షస పాలననుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పాణ్యం నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి చింతాసురే్‌షబాబు పిలుపునిచ్చారు.

రాష్ట్రాన్ని కాపాడుకోవాలి : జనసేన

నంద్యాల (ఆంధ్రజ్యోతి), సెప్టెంబరు 17 : రాక్షస పాలననుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పాణ్యం నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి చింతాసురే్‌షబాబు పిలుపునిచ్చారు. జనసేన క్రియాశీలక సభ్యంత్వంలో భాగంగా ఆదివారం సభ్యులకు బీమా పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టీడీపి, జనసేన కలిసి పనిచేయాలన్న జనసేన అధినేత నిర్ణయాన్ని శిరసావహించాలన్నారు. ఈమేరకు జనసేన పార్టీ సభ్యులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించిందన్నారు. రాజమండ్రిలో చంద్రబాబునాయుడను కలవడానికి వెళ్లిన పవన్‌ కళ్యాణ్‌ను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని పేర్కొన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు కలవడంతో వైసీపికి గుండెల్లో గుబులు పుట్టిందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతు నొక్కాలన్న వైసీపీ ప్రయత్నాలను జనసేన తిప్పికొట్టిందని, జనసేన కార్యకర్తలపై పోలీసుల వేధింపులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. మనోనిబ్బరంతో కార్యకర్తలు పనిచేసి వచ్చే ఎన్నికల్లో జగన్‌ ప్రభుత్వాన్ని కూకటి వేర్లతో పెకలించాలని అన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల నాయకులు జగదీశ్‌, కార్తీక్‌, ఆంజనేయులు, మహేశ్‌, పవన్‌కుమార్‌, సుధాకర్‌, సురేష్‌ కార్యకర్తలు పాల్గొన్నారు. ,

Updated Date - 2023-09-18T00:40:30+05:30 IST