్ఠక్వింటం ఎండు మిర్చి ధర రూ.48,786

ABN , First Publish Date - 2023-03-25T23:14:33+05:30 IST

కర్నూలు మార్కెట్‌యార్డుకు రైతులు తెచ్చిన ఎండుమిర్చి

్ఠక్వింటం ఎండు మిర్చి ధర రూ.48,786
కర్నూలు మార్కెట్‌యార్డుకు రైతులు తెచ్చిన ఎండుమిర్చి

ఒకే రోజు రూ.16 వేలకు పైగా పెరిగిన వైనం

గుంటూరు మార్కెట్‌ కంటే కర్నూలు యార్డులోనే అధిక ధర

కర్నూలు(అగ్రికల్చర్‌), మార్చి 25: కర్నూలు మార్కెట్‌ యార్డులోనే ఎండు మిర్చికి ధర అధికంగా లభిస్తుండటంతో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతోపాటు ఏపీ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కర్నూలు యార్డుకు ఎండు మిర్చిని రైతులు విక్రయానికి తెస్తున్నారు. శనివారం 295 క్వింటాళ్ల ఎండు మిర్చి బస్తాలను విక్రయానికి తీసుకువచ్చారు. శుక్రవారం కర్నూలు యార్డులో క్వింటానికి ఎండుమిర్చి ధర రూ.34 వేలు ధర లభించగా (గరిష్ఠ ధర) శనివారం ఏకంగా రూ.48,786కు అమ్ముడుపోయింది. ఎండు మిర్చిని తీసుకువచ్చిన రైతులు గుంటూరు మార్కెట్‌యార్డు కంటే కర్నూలు మార్కెట్‌ యార్డులోనే ధర ఎక్కువగా లభిస్తుందని అందువల్లనే ఇక్కడికే ఎండుమిర్చిని విక్రయానికి తెస్తున్నామని రైతులు తెలిపారు. ఉల్లి రైతుకు మాత్రం ధర ఆశాజనకంగా లేకపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. శుక్రవారం కనిష్ఠ ధర క్వింటానికి రూ.400కు పైగా లభించగా, శనివారం రూ.330కు మాత్రమే చేతికి వచ్చిందని లైసెన్సులు తీసుకున్న వ్యాపారులంతా పోటీల్లో పాల్గొనేలా అధికారులు ఎందువల్లనో గట్టి చర్యలు తీసుకోలేకపోతున్నారని ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లికి గరిష్ఠ ధర రూ.830 మాత్రమే లభిస్తుందని వారు తెలిపారు. వేరుశనగ రైతులకు కొంత ఊరట లభిస్తుంది. గరిష్ఠ ధర రూ.7,529, మధ్యస్థ ధర రూ.6,266, కనిష్ఠ ధర రూ.3,552 లభించింది. పొద్దుతిరుగుడు పూల విత్తనాల ధరలు దాదాపు గత పది రోజులతో పోలిస్తే రూ.1000కు దిగువకు పడిపోయింది గరిష్ట ధర రూ.4,619, మధ్యస్థ ధర రూ.4,409, కనిష్ఠ ధర రూ.786 మాత్రమే రైతుకు దక్కింది. ఆముదాల ధర గరిష్ఠంగా క్వింటంపై రూ.6,105, మధ్యస్థ ధర రూ.5,950, కనిష్ఠ ధర రూ.1,809 దక్కింది. మొక్కజొన్నలకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే ఏ మాత్రం పైకి చేరడం లేదు. గరిష్ఠ ధర రూ.2,066, మధ్యస్థ ధర రూ.1,989, కనిష్ఠ ధర రూ.1,570 ధర దక్కింది.

Updated Date - 2023-03-25T23:14:33+05:30 IST