ఉరుకుంద హుండీ ఆదాయం రూ.24 లక్షలు

ABN , First Publish Date - 2023-09-26T01:02:44+05:30 IST

మండలంలోని ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానంలో సోమవారం స్వామి హుండీ లెక్కింపు కార్యక్రమం ఆలయ ఈవో వాణి, పాలక మండలి చైర్మన్‌ నాగరాజుగౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఉరుకుంద హుండీ ఆదాయం రూ.24 లక్షలు

కౌతాళం, సెప్టెంబరు 25: మండలంలోని ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానంలో సోమవారం స్వామి హుండీ లెక్కింపు కార్యక్రమం ఆలయ ఈవో వాణి, పాలక మండలి చైర్మన్‌ నాగరాజుగౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. వారు మాట్లాడుతూ భక్తులు స్వామికి సమర్పించిన కానుకలు నగదు రూపంలో రూ.24,41,901, బంగారం 1.220 గ్రాములు, వెండి 5.200 కిలోలు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆదోని గ్రూపు టెంపుల్స్‌ ఈవో రాంప్రసాద్‌, ఆలయ పాలక మండలి సభ్యులు విజయేంద్ర రెడ్డి, నరసింహులు, రెడ్డి గీత, లక్ష్మీరెడ్డి, నరసమ్మ, రమణి, దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఆలయ అర్చక సిబ్బంది, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-09-26T01:02:44+05:30 IST