ఆలయానికి రూ.13.40 లక్షల ఆదాయం

ABN , First Publish Date - 2023-06-11T00:09:13+05:30 IST

మండలంలోని ఆర్‌ఎస్‌ రంగాపురం గ్రామ శివారులో వెలసిన మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి రూ.13.40 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో పాండురంగారెడ్డి, ఆలయ చైర్మన్‌ సీతారామచంద్రుడు శనివారం తెలిపారు.

ఆలయానికి రూ.13.40 లక్షల ఆదాయం

బేతంచెర్ల, జూన్‌ 10: మండలంలోని ఆర్‌ఎస్‌ రంగాపురం గ్రామ శివారులో వెలసిన మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి రూ.13.40 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో పాండురంగారెడ్డి, ఆలయ చైర్మన్‌ సీతారామచంద్రుడు శనివారం తెలిపారు. భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనార్థం అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, గండదీపాలు, తలనీలాల సమర్పణ, మొక్కుబడులు, సేవా టికెట్లు, లడ్డూ ప్రసాదాలు, కేశఖండన టికెట్లు, రూము బాడుగలు తదితర వాటి ద్వారా రూ.13,40,027 దేవస్థానానికి ఆదాయం లభించినట్లు వారు తెలిపారు.

ఆలయ జీర్ణోద్ధరణకు రూ.3.80 లక్షల విరాళం

మండల పరిధిలోని ఆర్‌ఎస్‌ రంగాపురం గ్రామ శివారులో వెలసిన మద్దిలేటి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్ర జీర్ణోద్ధరణకు రూ.3.80 లక్షలు భక్తులు విరాళం అందజేశారని ఈవో పాండురంగారెడ్డి, చైర్మన్‌ సీతారామచంద్రుడు శనివారం తెలిపారు. కడప జిల్లా పెద్దముడియం మండలం శుద్దపల్లి గ్రామానికి చెందిన బైరెడ్డి తిమ్మారెడ్డి కుమారుడు బైరెడ్డి మద్దిలేటి రెడ్డి రూ.1,00,116, అలాగే వివిధ భక్తుల ద్వారా రూ.2,80,116 మొత్తం రూ.3,80,232లు విరాళాలు వచ్చినట్లు వారు తెలిపారు. విరాళాలు ఇచ్చిన భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాలతో సత్కరించారు.

Updated Date - 2023-06-11T00:09:13+05:30 IST