చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి
ABN , First Publish Date - 2023-09-23T00:18:28+05:30 IST
చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని టీడీపీ కోడుమూరు ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్ అన్నారు.
టీడీపీ కోడుమూరు ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్
కోడుమూరు, సెప్టెంబరు 22: చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని టీడీపీ కోడుమూరు ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్ అన్నారు. చంద్రబాబుపై అక్రమ అరెస్టును నిరసిస్తూ గత 10 రోజులగా ఆకెపోగు ప్రభా కర్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. శుక్రవారం క్షలను మండల కన్వీనర్ కోట్ల కవితమ్మ, మాజీ సర్పంచు కేఈ రాంబాబు, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. ముం దుగా వైసీపీ ప్రభుత్వం అవలం భిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ కళ్లకు గంతలు కట్టుకొని ప్రధాన రోడ్డుపై మోకాళ్లపై బైఠాయించి ముఖ్య మంత్రి జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ భయపడేది లేదన్నారు. చంద్రబాబు బయట ఉంటే 2024 ఎన్నికల్లో గెలవలేమని వైసీపీ కుట్రలు చేస్తుందన్నారు. టీడీపీ నాయకులు కేఈ మల్లికార్జునగౌడ్, ఎల్లప్పనాయుడు, అమడగుంట్ల వెంక టేశ్వర్లు, గూడూరు సుందర్‌రాజు, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.